అప్పుడు శృతి హాసన్‌, ఇప్పుడు తమన్నా.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయితే మిల్కీ బ్యూటీ రచ్చ నెక్ట్స్ లెవల్‌

Published : Aug 04, 2023, 11:42 AM IST

ఈ ఏడాది శృతి హాసన్‌కి, తమన్నాకి ఒకేలా పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే శృతి రచ్చే చేసింది. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. మరి శృతి మ్యాజిక్‌ని రిపీట్‌ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   

PREV
15
అప్పుడు శృతి హాసన్‌, ఇప్పుడు తమన్నా.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అయితే మిల్కీ బ్యూటీ రచ్చ నెక్ట్స్ లెవల్‌

శృతి హాసన్‌..  ఏడాది ప్రారంభంలో రెండు తెలుగు సినిమాల్లో మెరిసింది. సంక్రాంతికి విడుదలైన `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణలతో శృతి హాసన్‌కి మొదటిసారి కలిసి నటించడం విశేషం. వీటిలో తనదైన అందచందాలతో రచ్చ చేసింది. సంక్రాంతి సందడంతా తనదే అనేట్టుగా రచ్చ చేసింది. రెండూ పెద్ద హిట్‌ కావడంతో, ఈ రెండు సినిమాల్లో శృతి హీరోయిన్ కావడంతో ఈ అమ్మడికి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనేలా ఒకే పండక్కి తన రెండు సినిమాలు విడుదలై హిట్‌ కావడంతో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది.
 

25

యాదృశ్చికంగా ఇప్పుడే తమన్నాకి అలాంటి పరిస్థితే వచ్చింది. ఆమె నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్‌ కాబోతున్నాయి. ఇటు తెలుగులో మెగాస్టార్ తో `భోళాశంకర్‌` సినిమా చేస్తుంది. మరోవైపు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో `జైలర్‌` మూవీ చేస్తుంది. ఈ ఇద్దరు హీరోల సరసన నటించడం తమన్నాకి తొలిసారి కావడం విశేషం. అంతేకాదు ఈ రెండు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒకేసారి ఒక్క రోజు గ్యాప్‌తో విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ ఇండిపెండెంట్‌ డేకి మిల్కీ బ్యూటీ రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. 
 

35

చిరంజీవి నటించిన `భోళాశంకర్‌` మూవీలో చిరుకి జోడీగా చేస్తుంది తమన్నా. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ అదరగొట్టాయి. మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుంది. ఇందులో కీర్తిసురేష్ చిరుకి చెల్లిగా చేస్తుంది. యంగ్‌ హీరో సుశాంత్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తమిళ(వేదాలం) రీమేక్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది. 

45

మరోవైపు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో మొదటిసారి `జైలర్‌` సినిమాలో నటిస్తుంది తమన్నా. ఇందులో మోహన్‌లాల్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా ఒక్క రోజు ముందుగా ఆగస్ట్ 10న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి. `కావాలయ్యా` పాటలో తమన్నా చేసిన రచ్చ ఇండియాని షేక్‌ చేస్తుంది. ఇక థియేటర్లలో ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతుందో చూడాలి.
 

55

ఇలా మొత్తంగా సంక్రాంతికి శృతి హాసన్‌ మాదిరిగానే రెండు సినిమాలతో రాబోతుంది తమన్నా. ఒక్క రోజు గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇలాంటి సిచ్చువేషన్‌ చాలా అరుదుగా వస్తుంటుంది. మరి సంక్రాంతికి రెండు సినిమాలతో హిట్‌ కొట్టిన శృతి హాసన్‌ మాదిరిగానే తమన్నా విజయాలు అందుకుంటుందా? శృతి మ్యాజిక్‌ మిల్కీ బ్యూటీకి వర్కౌట్‌ అవుతుందా? అనేది ఆసక్తికరంగా ఉత్కంఠకి గురి చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే తమన్నా రచ్చ నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుందని చెప్పొచ్చు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఆమె హంగామా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories