మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..

First Published | Apr 19, 2024, 2:40 PM IST

ఈ మధ్య స్టార్ డైరెక్టర్లు పాత హీరోయిన్లను బయటు తీసుకువస్తున్నారు. ఫెయిడ్ అవుట్ అయ్యి.. కనిపించకుండాపోయిన తారలకు డిపరెంట్ క్యారెక్టర్స్ ను ఇస్తూ.. సెకండ్ ఇన్నింగ్స్ కు కారణం అవుతున్నారు. అలాంటిప్రయత్నంలోనే తాజాగా బయటకు రాబోతోంది సిమ్రన్. 

హీరోయిన్ సిమ్రన్ గుర్తు ఉండే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్. దాదాపు దశాబ్ధానికి పైగా  తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఆతరువాత హీరోయిన్ గా అవకావాలు తగ్గడంతో.. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ కు ఫిక్స్ అయిపోయింది. ఈమధ్యే కొన్ని తమిళ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కనిపించింది సిమ్రన్. 

ఇక తెలుగులో కూడా సిమ్రన్ ఎంట్రీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా తాను హీరోయిన్ గా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోరనే సిమ్రన్ నటించబోతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్న పాన్ వరల్డ్ మూవీలో సిమ్రాన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?


టాలీవుడ్ దర్శకధీరుడు... తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన డైరెక్టర్  రాజమౌళి. ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని చాలామంది ఎదరు చూస్తుంటారు. కాని అది అందరికి సాధ్యం కాదు. అటువంటిది.. రాజమౌళి సినిమా కోసం ఆటీమ్ నుంచే పిలుపు వస్తే.. అది చాలా పెద్ద గౌరవంగా భావించవచ్చు. 

మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన నయనతార..? కన్నప్ప టీమ్ లో లుకలుకలు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి కాంబోలో ఇప్పుడు ఒక భారీ  సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాత్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దాదాపు ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. అమెజాన్ అడ్వెంచర్ జానర్ లో ఈమూవీ రూపొంద బోతోంది. 
 

SS Rajamouli teams up with cricketer David Warner

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటికే పలు రకాల ఆసక్తికరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ని రాజమౌళి ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకు వెళ్తాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమం లో రాజమౌళి మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ జోనర్  లో ఈమూవీ తెరకెక్కుతోంది. 
 

 మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ అయిన సిమ్రాన్ ను ఇప్పుడు ఈసినిమాలో ఎలా చూపించబోతున్నారు..? ఆమెకు ఎలాంటి పాత్ర ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
 

 ఒక వేళ తల్లీ కొడుకులుగా ఇస్తారా ఏంటి అంటూ.నెటిజన్లు ఇప్పటికే ప్రశ్నలువేస్తున్నారు.అయితే ఈ విషయం ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది అంతే. 

Mahesh Babu

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసి..  రాజమౌళి పాన్ వరల్డ్ లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. నిజానికి రాజమౌళి ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి మూవీ కూడా ఒక సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుస్తూ వచ్చింది. ఈ సినిమా ఎంతవరకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుందో  చూడాలి. మరోసారి ఆస్కార్ ను అందుకుంటే.. హాలీవుడ్ లో జక్కన్న పేరు ఫిక్స్ అయ్యేలా ఉ:ది. అటు మహేష్ ఇమేజ్ కూడా రెట్టింపుఅవుతుంది. 

Latest Videos

click me!