హీరోయిన్ ఛార్మి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఛార్మి శ్రీ ఆంజనేయం, మాస్, లక్ష్మీ, పౌర్ణమి, చిన్నోడు, రాఖీ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. అయితే ఛార్మి ఎక్కువకాలం హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశం వస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.