సీఎం స్టాలిన్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం.. శింబుపై భారీ కుట్ర అంటున్న తల్లిదండ్రులు

First Published Oct 22, 2021, 5:39 PM IST

కెరీర్ ఆరంభం నుంచే యువత మనసులు దోచుకున్న నటుడు శింబు. తమళనాట శింబుకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా గుర్తింపు ఉంది. శింబు వరుసగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తూ క్రేజ్ పెంచుకున్నాడు.

కెరీర్ ఆరంభం నుంచే యువత మనసులు దోచుకున్న నటుడు శింబు. తమళనాట శింబుకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా గుర్తింపు ఉంది. శింబు వరుసగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తూ క్రేజ్ పెంచుకున్నాడు. ఇక తన వ్యక్తిగత జీవిత వ్యవహారాలతో కూడా శింబు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా శింబు 2017లో నటించిన 'అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌' చిత్ర వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Simbu తల్లిదండ్రుల ఎంట్రీతో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. ఈ చిత్రాన్ని నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో శింబు నిర్లక్ష్య వైఖరి తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని.. కాబట్టి శింబు తనకు నష్టపరిహారం చెల్లించాలి అంటూ రాయప్పన్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. 

నిర్మాతల మండలి రాయప్పన్ కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించింది. అలాగే సినీ కార్మికులు కూడా శింబు చిత్రాలకు పనిచేయకూడదని దక్షణ భారత సినీ కార్మికుల సమ్మేళనం నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడిగా ఉన్న రోజా భర్త R. K. Selvamani కూడా ప్రకటన చేశారు. కానీ శింబు తన పరపతితో సినిమాలు చేస్తున్నాడు. శింబు నటించిన 'Maanaadu' చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.Venkat Prabhu దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మించబడింది. 

దీపావళి కానుకగా నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రజనీకాంత్ 'అన్నాత్తే' కూడా అదే టైంలో విడుదలవుతోంది. విశాల్ ' ఎనిమి' కూడా అదే టైంలో రిలీజవుతోంది. దీనితో శింబు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. దీనికి శింబు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. శింబు వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ శింబు తల్లిదండ్రులు టి రాజేందర్, ఉషా రాజేందర్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. 

శింబు చిత్రానికి అడ్డంకులు సృష్టించడానికి నిర్మాతల మండలి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శింబుపై రెడ్ కార్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని ఏమాత్రం సహించబోము అని హెచ్చరించారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్ విషయంలో శింబుని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని అతడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 

శింబుకి రాయప్పన్ పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదు. అలాంటిది శింబు ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. శింబుపై జరుగుతున్న కుట్రలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతాం. ఇప్పటికే ఎగ్మూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శింబు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శింబుపై జరుగుతున్న కుట్రని సీఎం స్టాలిన్ కు తెలియజేస్తాం. ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం అని శింబు తల్లి ఉషా రాజేందర్ స్పష్టం చేసింది.

Also Read: నటి ఒంటిపై దుస్తులు చించివేసిన నిర్మాత.. బలవంతంగా ఆ పని చేయమని, వేడుకున్నా వదల్లేదు 

click me!