చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నటీమణుల బలహీనతలు, అవసరాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలని బయట పెట్టేందుకు నటీమణులు భయపడేవాళ్లు. కానీ మీటూ ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ పై పోరాటం తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాల్ని వివరిస్తున్నారు.