Nayanthara Simbu Movie: 'అరసన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సింబు.. తన తర్వాతి సినిమాలో నయనతారతో జోడీ కట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుల నిజం ఎంత?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు సింబు. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్‌తో కలిసి 2025లో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమాలో సింబు నటించాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్‌లో 'అరసన్' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు సింబు తర్వాతి సినిమా, అందులో హీరోయిన్ గురించిన వార్తలు కోలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్నాయి.
24
'డ్యూడ్' డైరెక్టర్‌తో సింబు
'అరసన్' తర్వాత 'డ్యూడ్' సినిమా డైరెక్టర్ కీర్తీశ్వరన్ దర్శకత్వంలో సింబు ఒక సినిమా చేయనున్నాడు. ఇదొక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇందులో సింబు మునుపెన్నడూ చూడని ఊర మాస్ పోలీస్ ఆఫీసర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. సాయి అభయంకర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఒక పాట కూడా రెడీ అయిందని టాక్. అయితే చిత్రయూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
34
సింబుకు జోడీగా నయనతార?
ఈ కొత్త సినిమాలో సింబుకు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించబోతోందని సమాచారం. సింబు - నయనతారది కోలీవుడ్‌లో హిట్ పెయిర్. 2016లో పాండిరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఇదు నమ్మ ఆళు' సినిమాలో వీళ్లిద్దరూ చివరిసారిగా కలిసి నటించారు. ఇప్పుడు కీర్తీశ్వరన్ సినిమాలో నయన్ ఓకే చెబితే.. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ తెరపై సందడి చేయనుంది.
'డ్రాగన్' మూవీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుతో సింబు ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అశ్వత్ ప్రస్తుతం రజనీకాంత్ 'ధర్మన్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే సింబుతో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్‌లో వెట్రిమారన్ 'అరసన్' పూర్తి చేసి, వెంటనే కీర్తీశ్వరన్ యాక్షన్ మూవీని పట్టాలెక్కించాలని సింబు ప్లాన్ చేస్తున్నాడు.