రాజశేఖర్‌ హీరోగా పనికిరాడు అని మొహం మీదే చెప్పిన నిర్మాత.. కట్‌ చేస్తే ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్

Published : Apr 04, 2025, 07:44 PM IST

Rajasekhar: విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాజశేఖర్‌ ఆ తర్వాత హీరోగా మారి తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రారంభంలో ఆయన చాలా అవమానాలు ఫేస్‌ చేశాడట.   

PREV
15
రాజశేఖర్‌ హీరోగా పనికిరాడు అని మొహం మీదే చెప్పిన నిర్మాత.. కట్‌ చేస్తే ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్
rajasekhar

Rajasekhar: హీరో రాజశేఖర్‌ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని హీరోగా నిలబడ్డాడు. విలన్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా టర్న్ తీసుకుని యాంగ్రీ యంగ్‌ మేన్‌గా పిలిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ నటుడిగా స్ట్రగుల్‌ అవుతున్నాడు.

అయితే ఆయన ప్రారంభంలో కొన్ని అవమానాలు ఫేస్‌ చేశాడట. ఓ నిర్మాత రాజశేఖర్‌ హీరోగా పనికి రాడు అన్నారట. కానీ ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్ చేశాడట రాజశేఖర్‌. మరి ఆ నిర్మాత ఎవరు? ఆ కథేంటో చూద్దాం. 

25
rajasekhar

రాజశేఖర్‌ `ప్రతిఘటన` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు తమిళంలో రెండు సినిమాలు చేశారు. అందులో ఆయనవి నెగటివ్‌ రోల్స్. తెలుగులో చేసిన `ప్రతిఘటన` చిత్రానికి టి కృష్ణ దర్శకుడు. ఈ మూవీకి రాజశేఖర్‌ని ఎంపిక చేసినప్పుడు ఓ నిర్మాత వ్యతిరేకించాడట.

ఆయన హీరోగానే పనికిరాడు అన్నారట. వేరే హీరోని చూసుకో అని చెప్పాడట. ఆయన ఎవరో కాదు అప్పటి నిర్మాత పోకూరి బాబూరావు. టి కృష్ణకి ఆయన చాలా క్లోజ్‌. ఆయన సినిమాల్లో బాబూరావు ప్రమేయం ఏదో రూపంలో ఉండేది.  ఆయన నిర్మాతగా మారడానికి కూడా టి కృష్ణనే కారణం. 
 

35
rajasekhar (photo credit-etv)

దీంతో `ప్రతిఘటన` సినిమా సమయంలోనే రాజశేఖర్‌ని హీరోగా పనికిరాదు అని చెప్పారట. కానీ టి కృష్ణ తనలో ఏం చూశాడో ఏంటో ఆ మూవీకి రాజశేఖర్‌ని ఎంపిక చేశారు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు ఈ యాంగ్రి యంగ్‌ మేన్‌. బాబూరావు మాటలు తప్పు అని నిరూపించుకున్నారు.

`వందేమాతరం` చిత్రంతో మరింతగా రెచ్చిపోయాడు రాజశేఖర్‌. `తలంబ్రాలు`తో మరింతగా ఆకట్టుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 
 

45
pokuri baburao

ఆ తర్వాత రాజశేఖర్‌ని ఎదుగుదలని, ఆయనకు ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చూసిన నిర్మాత పోకూరి బాబూరావు రియలైజ్‌ అయ్యాడు. రాజశేఖర్‌తోనే సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చాడు. అలా తన `ఈతరం ఫిల్మ్స్`ని స్థాపించి పలు విజయవంతమైన సినిమాలు చేశారు.

రాజశేఖర్‌తోనే ఐదారు చిత్రాలు నిర్మించారు. వాటిలో చాలా వరకు అన్నీ పెద్ద హిట్స్. రాజశేఖర్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన `అన్న` మూవీని ఆయనే నిర్మించారు. ఆ సినిమా 1994లో వచ్చి ఆకట్టుకుంది. దీంతోపాటు `మా ఆయన బంగారం`, `ఎర్ర మందారం` వంటి చిత్రాలు చేశారు. తనని అవమానించిన నిర్మాతకు బ్యానర్‌ గర్వపడే చిత్రాలను ఇచ్చారు రాజశేఖర్‌. 

55
rajasekhar

 రాజశేఖర్‌ ఇప్పుడు హీరోగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. హీరోగా సినిమాలు చేయాలా? క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకోవాలా? అనే డైలామాలో ఉన్నారు. ఆ మధ్య నితిన్‌ హీరోగా వచ్చిన `ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీలో కీలక పాత్రలో నటించారు. కానీ సినిమా ఆడలేదు. దీంతో ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు శర్వానంద్‌ సినిమాలో తండ్రిగా నటిస్తున్నారని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

read  more: కృష్ణ `దేవదాసు` ఫ్లాప్‌ కి కారణమేంటో తెలుసా? ఏఎన్నార్‌ అంత దెబ్బ కొట్టాడా?.. సూపర్‌ స్టార్‌ బయటపెట్టిన నిజాలు

also read: హన్సికపై వేధింపుల కేసు, కోర్ట్ కు వెళ్లిన సోదరుడి భార్య.. స్టార్‌ హీరోయిన్‌ ఏం చేసిందంటే ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories