హన్సికపై వేధింపుల కేసు, కోర్ట్ కు వెళ్లిన సోదరుడి భార్య.. స్టార్ హీరోయిన్ ఏం చేసిందంటే ?
హన్సిక మోత్వానీ తన సోదరుడి భార్యను వేధించిందనే ఆరోపణలపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై పోలీసులు స్పందించాలని కోర్టు ఆదేశించింది.
హన్సిక మోత్వానీ తన సోదరుడి భార్యను వేధించిందనే ఆరోపణలపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై పోలీసులు స్పందించాలని కోర్టు ఆదేశించింది.
హన్సిక మోత్వానీ:
బాలనటిగా వెండితెరకు పరిచయమైన హన్సిక మోత్వానీ `దేశముదురు` మూవీతో హీరోయిన్‌గా మారింది. అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది హన్సిక. దీంతో తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. తెల్లటి పాల బుగ్గలతో అలరిస్తూ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ప్రామిసింగ్ హీరోయిన్‌గా నిలిచింది. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాలపైనే శ్రద్ధ:
చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు `రౌడీ బేబీ`, `మ్యాన్`, `కాంతారి` అనే తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే `నిషా` అనే తెలుగు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. గతంలో క్రేజీ స్టార్‌గా రాణించిన హన్సికకి ఆఫర్లు తగ్గాయి. దీంతో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. వ్యాపారవేత్త సోహైల్ కతురియాను 2020లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాల్లోనే కొనసాగుతోంది. కానీ, ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు.
ప్రశాంత్ మోత్వానీ:
హన్సిక పెళ్లి తర్వాత ఆమె సోదరుడు ప్రశాంత్ మోత్వానీ తన భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా విడాకుల కోసం కూడా అప్లై చేశాడు. దీంతో ప్రశాంత్ మోత్వానీ, ముస్కాన్ నాన్సీ జేమ్స్ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ముస్కాన్ నాన్సీ జేమ్స్
ఈ నేపథ్యంలో ముస్కాన్ నాన్సీ జేమ్స్ ముంబైలోని అంబాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ప్రశాంత్ మోత్వానీ తల్లి మోనా, హన్సిక మోత్వానీ ఇద్దరూ తనను వేధిస్తున్నారని, తన భర్తతో కలిసి జీవించడానికి అనుమతించడం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
ముంబై అంబాలి పోలీసులు కేసు నమోదు:
దీంతో హన్సిక మోత్వానీతో పాటు ఆమె తల్లి, సోదరుడిపై ముంబై అంబాలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కారణంగా గత ఫిబ్రవరిలో హన్సిక మోత్వానీ, ఆమె తల్లి ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో సోదరుడి భార్య చేసిన ఫిర్యాదులోని ఆరోపణలను ఖండిస్తూ హన్సిక ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కేసు జూలై 3కి వాయిదా:
అంతేకాకుండా తన సోదరుడికి, ముస్కాన్‌కు 2021 నుంచి అభిప్రాయభేదాలు ఉన్నాయని, దీంతో ఇద్దరూ 2022లో పరస్పరం విడాకులు తీసుకుని విడిపోయారని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో హన్సిక దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముంబై హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై ముంబై అంబాలి పోలీస్ స్టేషన్ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించి, కేసును జూలై 3కి వాయిదా వేసింది (Police Ordered to Reply: Hansika Approaches Court).
సినిమాల్లో బిజీగా ఉంది:
హన్సిక సెలబ్రిటీ కావడంతో పాటు ఆమె తల్లి వయసు మీద పడటంతో ఈ కేసు కొట్టివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. హన్సిక వరుసగా సినిమాల్లో బిజీగా ఉంది. రీఎంట్రీ ఇస్తున్న హన్సికను త్వరలోనే తెరపై చూడొచ్చు.
also read: 28 Degree Celsius Movie Review: `28 డిగ్రీ సెల్సియస్` మూవీ రివ్యూ