80, 90 దశకాల్లో సిల్క్ స్మితకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో బోల్డ్ గా కనిపించేది.
80, 90 దశకాల్లో సిల్క్ స్మితకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో బోల్డ్ గా కనిపించేది. చాలా చిత్రాల్లో ఆమెని ప్రత్యేక పాత్రల కోసం, స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకనిర్మాతలు తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆమె డేట్లు కూడా దొరకడం కష్టంగా మారే పరిస్థితి ఉండేది.
24
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో దక్కిన సూపర్ హిట్ చిత్రాల్లో ఛాలెంజ్ ఒకటి. ఈ చిత్రంలో సుహాసిని, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రలో సిల్క్ స్మిత కూడా నటించింది. సిల్క్ స్మిత, సుహాసిని విషయంలో ఆసక్తికర సంఘటన జరిగిందట. చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు దర్శకుడు కోదండ రామిరెడ్డి ప్లాన్ చేశారు. కానీ స్మిత బిజీగా ఉండడం వల్ల హాజరు కాలేదు.
34
remembering silk smitha at her 28th death anniversary
కొన్ని రోజుల తర్వాత తాను షూటింగ్ కి హాజరవుతానని స్మిత సడెన్ గా నిర్మాతలకు తెలియజేసింది. అదే రోజు చిరంజీవికి, సుహాసిని మధ్య సన్నివేశాల చిత్రీకరణ ఉంది, దీనితో నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. చిరంజీవితో కలసి చర్చించి సుహాసిని సన్నివేశాల చిత్రీకరణని క్యాన్సిల్ చేశారట. ఆ రోజు షూటింగ్ కి రావద్దని సుహాసినికి చెప్పారట.
44
Suhasini
తనకంటే అడల్ట్ రోల్స్ చేసే నటికి చిరంజీవి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సుహాసిని జీర్ణించుకోలేకపోయింది. సిల్క్ స్మిత షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజులు సుహాసిని షూటింగ్ కి హాజరు కాకుండా డుమ్మా కొట్టిందట. తనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే సుహాసిని అలా రివేంజ్ తీర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి.