ఫోన్‌ చేసినప్పుడు వెళ్లి ఉంటే సిల్క్ స్మిత చనిపోయేది కాదు, రాజవైభవం అనుభవించి స్టెచ్చర్‌పై ఈగలు వాలుతూ చూడలేకపోయా

Published : Sep 08, 2025, 05:47 PM IST

సిల్క్ స్మిత సూసైడ్‌ చేసుకుని కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె బతికే ఛాన్స్ ఉండేదట. తాను ఫోన్‌ చేసినప్పుడు వెళ్లి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని చెప్పింది నటి అనురాధ. 

PREV
15
వ్యాంపు పాత్రలతో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత

సిల్క్ స్మిత వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. వ్యాంప్‌ పాత్రలతో, ఐటెమ్‌ సాంగ్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. హీరోయిన్‌గానూ మెప్పించింది. స్టార్‌ హీరోయిన్లకి మించిన ఇమేజ్‌, క్రేజ్‌తో సౌత్‌ సినిమా ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది. సినిమాల్లో హీరోయిన్‌ లేకపోయినా ఫర్వాలేదు, సిల్క్ స్మిత ఉంటే చాలు అనేంతగా ఆమెకి డిమాండ్‌ ఉండేదంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో సిల్క్ స్మిత ఉందంటే వంద టికెట్లు ఎక్స్ ట్రా తెగేవి అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

25
సిల్క్ స్మిత మరణం పెద్ద మిస్టరీ

ఇదిలా ఉంటే సిల్క్ స్మిత మరణం పెద విషాదం. చాలా దారుణ స్థితిలో ఆమె మరణించింది. సూసైడ్‌ చేసుకుందని ఆమె నోట్‌లో పేర్కొంది. ఆమెని హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీ. వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించడం, నమ్మిన వాడు మోసం చేయడం, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురిచేయడం, నా అనేవారు లేకపోవడంతో ఒంటరి ఫీలైన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుందని అంటుంటారు. నిజం ఏంటనేది తెలియదు.

35
చనిపోయే ముందు స్నేహితురాలు అనురాధకి సిల్క్ స్మిత ఫోన్‌

చనిపోయే ముందు సిల్క్ స్మిత తన ఫ్రెండ్స్ కి ఫోన్‌ చేసింది. ఆ సమయంలో వాళ్లు స్పందిస్తే ఆమె బతికేదేమో. తాజాగా సిల్క్ స్మిత స్నేహితురాలు, నటి అనురాధ ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్‌ చేసిందట. ఎక్కడ ఉన్నావ్‌, ఫ్రీగా ఉన్నావా? ఇంటికి వస్తావా? అని అడిగిందట సిల్క్ స్మిత. తాను రేపు మార్నింగ్‌ వస్తానని చెప్పిందట. కుదిరితే ఇప్పుడు రాగలవా అంటే, అనురాధకు కుదరకపోవడంతో వెళ్లలేకపోయిందట. అయితే కారణం ఆ సమయంలో చెప్పలేదట సిల్క్ స్మిత. ఏదైనా కారణం చెప్పి ఉంటే తాను వెళ్లేదాన్ని అని, కాజ్వల్‌గానేమో అనుకుని మార్నింగ్‌ వస్తానని చెప్పిందట అనురాధ. సరే అని సిల్క్ స్మిత ఫోన్‌ పెట్టేసిందట.

45
ఉదయాన్ని షాకిచ్చే వార్త

కట్‌ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఫ్లాష్‌ న్యూస్‌. సిల్క్ స్మిత కన్నుమూత అంటూ వార్తలు వచ్చాయి. దీంతో దెబ్బకి తాను షాక్‌ కి గురైనట్టు తెలిపింది సీనియర్‌ నటి అనురాధ. ఆ సమయంలో చాలా బాధపడిందట. తాను అప్పుడే వెళ్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదేమో అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి వెళ్లగా, అప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఆసుపత్రికి వెళ్లగా, మామూలు స్టెచ్చర్‌పై సిల్క్ స్మిత బాడీ ఉందని, ఈగలు, దోమలు వాలుతున్నాయని, అలా చూసి గుండె చలించిపోయిందని చెప్పింది అనురాధ. ఒకప్పుడు రాజవైభవం అనుభవించింది. ఆమె బాడీని ఎంతో మంది ఆరాధించేవారు. కానీ ఆ దశలో ఆమె అలా పడి ఉండటం హృదయాన్ని కలిచివేసిందని తెలిపింది అనురాధ.

55
సిల్క్ స్మిత sన బాధలు ఎప్పుడూ పంచుకోలేదు

సిల్క్ స్మిత్‌ చాలా ఇంట్రోవర్ట్ అని, ఏదీ పైకి చెప్పేది కాదని, అన్నీ లోపలే దాచుకునేది అని వెల్లడించింది. తాము క్లోజ్‌గానే ఉంటామని, కానీ తన బాధలు చెప్పలేదని వెల్లడించింది. నటి అనురాధ సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్‌ 23న కన్నుమూశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories