మనవరాలిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ .. శ్రీదేవిని అందం చూసి ఎన్టీఆర్ ఇలా అన్నారట!

Published : Sep 08, 2025, 04:46 PM IST

NTR and Sridevi in Vetagadu:  వేటగాడు సినిమాలో ఎన్టీఆర్–శ్రీదేవి జంట పెద్ద వివాదం అయ్యింది. ‘మనవరాలు’గా నటించి శ్రీదేవితో రొమాన్స్ చేయడం సంచలనం. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమండి రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

PREV
16
ఎన్టీఆర్ ప్రయోగం

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామరావు (NTR)  చేసిన ప్రతి సినిమా ప్రయోగమే. ఆయన యాక్టింగ్, డ్యాన్స్, రొమాన్స్—ఏ కోణంలో చూసినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలా 1979లో విడుదలైన ‘వేటగాడు’ సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి తొలిసారిగా హీరోయిన్‌గా నటించారు. ఇది వీరిద్దరి జంటగా వచ్చిన తొలి సినిమా కావడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.

26
వివాదానికి దారి

ఎన్టీఆర్, శ్రీదేవి మధ్య దాదాపు 40 ఏళ్ల వయస్సు తేడా ఉండటం, అంతకు ముందు వచ్చిన ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ మనవరాలిగా నటించడం, కొద్ది కాలానికే  ‘వేటగాడు’ లో ఆయన సరసన హీరోయిన్‌గా నటించడం విమర్శలకు దారి తీసింది. సినీ వర్గాల్లోనూ, సమాజంలోనూ అనేక రకాల కామెంట్లు వినిపించాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం తగ్గకుండా, తనకు నచ్చిన కథ, పాత్ర ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనుకాడరని మరోసారి నిరూపించారు.

36
రాఘవేంద్రరావు కీలక పాత్ర

ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమాంధి రామారావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్–శ్రీదేవి కాంబినేషన్ కుదరడానికి ప్రధాన కారణం దర్శకుడు కె. రాఘవేంద్రరావు అని చెప్పారు. శ్రీదేవి కుటుంబానికి రాఘవేంద్రరావు అత్యంత సన్నిహితుడు కావడంతో, ఆమెను టాప్ హీరోయిన్‌గా మార్చాలని నిర్ణయించారని తెలిపారు. ఈ పరిచయంతోనే శ్రీదేవిని ఎన్టీఆర్‌కు సిఫారసు చేశారని వివరించారు.

46
ఎన్టీఆర్ స్పందనతో షాక్

మొదట్లో ఎన్టీఆర్ ఏమైనా అభ్యంతరం చెబుతారా అని రాఘవేంద్రరావు భయపడ్డారని రామారావు తెలిపారు. కానీ ఆయన ఊహలకు విరుద్ధంగా, ఎన్టీఆర్ చాలా ప్రొఫెషనల్‌గా స్పందించారని చెప్పారు. “కొత్త అమ్మాయి బాగుంటుంది, వెంటనే తీసుకురండి” అని చెప్పడమే కాకుండా, శ్రీదేవి అందం చూసిన తర్వాత ఆశ్చర్యపోయారని రామారావు వెల్లడించారు.

56
ఎన్టీఆర్ ప్రొఫెషనలిజం – పర్ఫెక్షన్

ఎన్టీఆర్ నిజమైన ప్రొఫెషనల్ యాక్టర్ అని రామారావు ప్రశంసించారు. గతంలో మనవరాలిగా నటించిన హీరోయిన్‌తో రొమాన్స్ చేయడంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం ఆయన ప్రొఫెషనలిజానికి నిదర్శనం అన్నారు. ఒక షాట్ పర్ఫెక్ట్‌గా రాకపోతే పలుమార్లు రీటేక్ చేయించేవారని, ఆయన పక్కన నిలబడగలిగిన హీరోయిన్ జయసుధ మాత్రమేనని రామారావు వ్యాఖ్యానించారు.

66
ఎన్టీఆర్–శ్రీదేవి అండర్ స్టాండింగ్

అలాగే శ్రీదేవి, ఎన్టీఆర్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేదని తెలిపారు. ముఖ్యంగా, శ్రీదేవి ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన తర్వాత ఎన్టీఆర్ నటన మరింత పేట్రేగిపోయిందని చెప్పారు. అప్పటి వరకు ఆయన పర్ఫెక్షన్ కోసం చేసిన కృషి రెట్టింపైందని గుర్తు చేశారు. 

ఎన్టీఆర్ అనేక మంది హీరోయిన్లతో సహజంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని రామారావు అన్నారు. ఆయన మనస్తత్వం ఇతరులకంటే భిన్నంగా ఉండేదని చెప్పారు. విమర్శలు ఎదురైనా, తెరపై ఎన్టీఆర్–శ్రీదేవి జంట అద్భుతంగా మెప్పించిందని, ఇలాంటి సాహసాలు చేయగల ధైర్యం ఎన్టీఆర్‌కే సాధ్యమని అప్పటి సినీ వర్గాలు అంగీకరించాయని రామారావు స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories