ఈ క్రమంలో సిల్క్ స్మితతో తనకున్న అనుబంధం డిస్కో శాంతి తెలియజేసింది. అలాగే సిల్క్ స్మిత లగ్జరీ లైఫ్ ఎలా ఉండేదో డిస్కో శాంతి వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. సిల్క్ స్మిత చాలా మంచిది. చనువుగా మాట్లాడేది. నేను అక్క అని పిలిచేదాన్ని. తన భర్త గురించి, ఆయన రెండో పెళ్లి, పిల్లల గురించి చెబుతూ ఉండేది. నాతో ప్రతి విషయం పంచుకునేది.
సిల్క్ స్మిత ఆ రోజుల్లోనే లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు ఆమె లక్ష నుండి మూడు లక్షల పారితోషికం ఆర్జించేది. మేము ఆ స్థాయికి రావడానికి పదేళ్ల సమయం పట్టింది. ఆమెది లగ్జరీ లైఫ్. నెలకు రూ. 5 లక్షలు చెల్లించి అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా అంటే, వినేది కాదు.