తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబుతో రాజమౌళి చేసే మూవీ(SSMB29). దీని కోసం ఇండియన్ ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. రాజమౌళి నెక్ట్స్ మూవీ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ వారిలో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏడాదికి పైగానే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు రైటర్ విజయేంద్రప్రసాద్. మరి సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది అందరిలోనూ నెలకొన్న ప్రశ్న, క్యూరియాసిటీ.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పలు ఈవెంట్లలో విజయేంద్రప్రసాద్ చెబుతూ వచ్చే ఏడాది ప్రారంభం అవుతున్నారు. 2025 ప్రారంభంలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏం జరుగుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందా? క్యాస్టింగ్ ఎంపిక జరుగుతుందా ? అనేది సస్పెన్స్ గా మారింది.
దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్, లీకేజీలు కూడా బయటకు రానివ్వం లేదు. చాలా స్ట్రిక్ట్ గా దీన్ని ఫాలో అవుతున్నారు. స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతోపాటు కాస్టింగ్, టెక్నీషియన్లు, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ వంటివాటిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. `ఇండియానా జోన్స్` సినిమాలంటే తనకు ఇష్టమని, ఆ బ్యాక్ డ్రాప్‌లోనే ఓ ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ అడ్వెంచర్‌ని తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
మహేష్ బాబు అంతర్జాతీయ సాహసికుడిగా కనిపిస్తాడని, మాస్, రా, రస్టిక్‌గా ఆయన పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. ఆ పాత్ర కోసం జుట్టు, గెడ్డం పెంచి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు మహేష్. తన లుక్‌తోనే ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నారు. రియల్ లుక్‌లోనే ఇలా ఉంటే అదే సినిమాలో పాత్ర లుక్‌లో కనిపిస్తే ఇక పూనకాలే అని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా సినిమా బడ్జెట్ గురించి సరికొత్త చర్చ ప్రారంభమైంది. ఈ మూవీకి బడ్జెట్ వెయ్యి కోట్ల వరకు అవుతుందనే టాక్ వినిపిస్తుంది. వెయ్యి కోట్లు అవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు ఆడియెన్స్.
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు కాదు దాన్ని మించి అవుతుందట. ఈజీగా 1200-1300కోట్లు అయ్యే అవకాశం ఉందట. ఈ విషయాన్ని సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. రాజమౌళి ప్లాన్ ప్రకారం తీస్తే ఈ సినిమా ఈజీగా 12, 13వందల కోట్లు అవుతుందన్నారు.
మరి ఇంత బడ్జెట్ పెట్టి రికవరీ ఎలా అనే సందేహం ఉంటుంది. అయితే దానికి రాజమౌళి వద్ద ప్లాన్ ఉందట. ఓ సందర్భంలో కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం సినిమాని దేశంలో ఒకటి రెండు శాతం ఆడియెన్స్ మాత్రమే చూస్తున్నారు. సినిమాని ఆడియెన్స్ దగ్గరికి తీసుకెళ్లాలని, సినిమా చూసే ఆడియెన్స్ పర్సెంటేజ్‌ని పెంచాలని ఆయన తెలిపారు.
`బాహుబలి 2` సినిమా 1800కోట్లు వసూలు చేసింది. దీన్ని 1, 2 శాతం ఆడియెన్స్ మాత్రమే చూశారట. అలాంటిది నాలుగైదు శాతానికి పెంచితే ఈజీగా మూడు, నాలుగు వేల కోట్లు వసూలు చేసే సత్తా ఇండియాలో ఉందనేది రాజమౌళి అభిప్రాయం. ఆ దిశగానే ప్రమోషన్స్ ప్లాన్ కూడా ఉందట.