టిల్లు గానికి మరో పేరు..'యూత్ యువరాజు' తెగ వైరల్ అవుతోందిగా..

First Published | Aug 16, 2024, 10:04 PM IST

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అల్లరి యువతకి బాగా నచ్చేసింది. 

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అల్లరి యువతకి బాగా నచ్చేసింది. తాజాగా సిద్దు రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రంలో కామియో అప్పియరెన్స్ ఇచ్చాడు. 

మిస్టర్ బచ్చన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ సిద్దు కామియో అప్పియరెన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ సిద్దు జొన్నలగడ్డ పాత్రని ప్రీ క్లైమాక్స్ లో దింపాడు. సిద్దు చెప్పిన డైలాగులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. డీజే టిల్లు చిత్ర తరహా యాటిట్యూడ్ తో అలరించాడు. 


సిద్దు తనని తాను యూత్ యువరాజు అంటూ పరిచయం చేసుకుంటాయి. ఇప్పుడు యూత్ యువరాజు అనేది టిల్లు తరహాలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. నెటిజన్లు ఈ పేరుని తెగ వైరల్ చేస్తున్నారు. ఈ టైటిల్ తో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే టాక్ వినిపిస్తోంది. 

Latest Videos

click me!