నీ నటనతో నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి..ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న హీరోపై ఎన్టీఆర్ కామెంట్స్ 

First Published | Aug 16, 2024, 9:10 PM IST

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన మరో చిత్రం కాంతర కూడా జాతీయ అవార్డులతో సత్తా చాటింది. 

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. తెలుగులో కార్తికేయ2 చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన మరో చిత్రం కాంతర కూడా జాతీయ అవార్డులతో సత్తా చాటింది. 

ఈ చిత్ర హీరో రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ పాపులర్ ఫిలిం గా కాంతార నిలిచింది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్న రిషబ్ శెట్టికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 


రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి నీకు శుభాకాంక్షలు. ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న నీకు ఆ అవార్డు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాంతార చిత్రంలో నీ పెర్ఫామెన్స్ కి ఇప్పటికి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. 

Rishab Shetty

అదే విధంగా బెస్ట్ పాపులర్ ఫిలిం గా నిలిచినా కాంతార చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ పై ఎంతో అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఓ ఫంక్షన్ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తల్లి మా కర్ణాటకకు చెందిన వారే.. కాబట్టి తారక్ కూడా మావాడే అంటూ ప్రేమ కురిపించారు. 

Latest Videos

click me!