నాని తర్వాతి చిత్రాల లైనప్.. ఓజి డైరెక్టర్ తో సినిమా, హిట్ 3 ఉంటుందా ?

First Published | Aug 16, 2024, 8:09 PM IST

సరిపోదా శనివారం తర్వాత నాని నటించే చిత్రాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. బలగం డైరెక్టర్ వేణుతో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. నాని ఆ చిత్రాన్ని పక్కన పెట్టి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని లైన్ లోకి తీసుకువచ్చాడు. 

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఆగష్టు 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. శనివారం రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించే యువకుడిగా నాని ఈ చిత్రంలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండడం తో ఆసక్తి మరింత పెరిగింది. 

సరిపోదా శనివారం తర్వాత నాని నటించే చిత్రాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. బలగం డైరెక్టర్ వేణుతో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. కానీ చివరి నిమిషంలో నాని ఆ చిత్రాన్ని పక్కన పెట్టి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని లైన్ లోకి తీసుకువచ్చాడు. 


నాని కమిటై ఉన్న మరో చిత్రం హిట్ 3. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతోంది తెలియని పరిస్థితి. అదే విధంగా ఓజి డైరెక్టర్ సుజిత్ తో ఆ మధ్యన సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. 

వీటన్నింటిపై నాని క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల చిత్రం, హిట్ 3 రెండు చిత్రాల షూటింగ్ పార్లల్ గా జరుగుతుందని నాని తెలిపారు. ఈ రెండు పూర్తయ్యాక సుజిత్ దర్శకత్వంలో మూవీ ఉంటుంది. ఇందులో సుజిత్ నన్ను ఫెరోషియస్ గా ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా మాస్ లుక్ లో చూపించబోతున్నాడు అని నాని తెలిపారు. 

Latest Videos

click me!