సిద్దార్దకు ఎందుకింత ప్రస్టేషన్? ‘యానిమల్’ పై విరుచుకుపడ్డాడు !

First Published Apr 14, 2024, 12:55 PM IST

సిద్దార్ద్ ఈ సినిమాపై డైరక్ట్ ఎటాక్ చేసారు. అందుకు కారణం సిద్దార్ద్ చిత్రం అనుకున్న స్దాయిలో ఆడకపోవటమే. 
 

Siddharth


 బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌' విమర్శల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సినిమా రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యాక మరింతగా సందీప్ పై సోషల్ మీడియాలో దాడి మొదలైంది. కొందరు సెలబ్రెటీలు డైరక్ట్ గానే విమర్శలు చేసారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి హీరో సిద్దార్ద్ చేరారు. యానిమల్ సినిమాపై డైరక్ట్ గానే విమర్శలు చేసారు.

siddharth


సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ లోనూ బాగానే వర్కవుట్ అయ్యింది.  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది.  
 

 ఇప్పటికే ఇలాంటి చిత్రాల వల్ల సమాజానికి తీవ్రస్థాయిలో ముప్పు తప్పదని మహిళా ఎంపీలు అభిప్రాయపడ్డారు. స్త్రీ విద్వేష సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు సిద్దార్ద్ ఈ సినిమాపై డైరక్ట్ ఎటాక్ చేసారు. అందుకు కారణం సిద్దార్ద్ చిత్రం అనుకున్న స్దాయిలో ఆడకపోవటమే. 
 

హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్తా తమిళ సినిమా గతేడాది వచ్చి ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో చిన్నా పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే, తెలుగులో ఈ సినిమా విజయం సాధించలేదు.  సిద్ధార్థ్ గట్టిగా ప్రమోషన్స్  చేసినా.. జనం పట్టించుకోలేదు. చిన్నా ఆశించిన విధంగా కలెక్షన్లను రాబట్టలేదు. 


కాగా, తాజాగా జేఎఫ్‍డబ్ల్యూ ఈవెంట్‍కు హాజరైన సిద్ధార్థ్ తన సినిమాపై వచ్చిన కామెంట్లకు స్పందించారు. ఈ క్రమంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీపై కాస్త విమర్శనాత్మకంగా మాట్లాడారు. చిన్నారులపై వేధింపుల అంశంపై చిన్నా సినిమా తెరకెక్కింది. అయితే, చిన్నా చిత్రం తమకు ఇబ్బందిగా అనిపించిందని తనకు కొందరు పురుషులు చెప్పారని సిద్ధార్థ్ అన్నారు. కానీ అలాంటి వారే యానిమల్ సినిమా చూడగలిగారని సిద్ధార్థ్ చెప్పారు.

Animal

సిద్దార్ద్ మాట్లాడుతూ... “చిన్నా సినిమా ఇబ్బందికరంగా ఉందని, చూడలేకపోయామని ఏ మహిళ కూడా నాకు కానీ, అరుణ్‍ (చిన్నా డైరెక్టర్)కు కానీ చెప్పలేదు. కానీ చాలా మంది పురుషులు నాకు అలా చెప్పారు. అలాంటి సినిమాలు చూడలేమని వారు నాతో అన్నారు. కానీ వాళ్లు మృగం (యానిమల్ తమిళ వెర్షన్) సినిమా చూస్తారు. కానీ వారికి నా సినిమాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అది ఇబ్బంది కాదు.. సిగ్గు, అపరాధ భావం. ఓకే. కానీ త్వరలోనే అది మారుతుంది” అని సిద్ధార్థ్ అన్నారు.


చిన్నా సినిమా ఇబ్బందికరంగా ఉందని తనకు మహిళలు ఎవరూ చెప్పలేదని, కొందరు పురుషులు చెప్పారని సిద్ధార్థ్ అన్నారు.ఇక లాస్ట్ ఇయిర్  చిన్నా రిలీజ్‍కు ముందు నిర్వహించిన ప్రెస్‍మీట్‍లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నామని, కానీ తన చిత్రాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని మాట్లాడారని తెలిపారు. ఎట్టకేలకు ఏషియన్ ఫిల్మ్స్ తెలుగులో రిలీజ్ చేసింది. గతేడాది అక్టోబర్ 6న చిన్నా విడుదలైంది. అయితే, అనుకున్నట్లుగానే వసూళ్లు రాలేదు. చిన్నా చిత్రానికి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ నటనకు చాలా ప్రశంసలు దక్కాయి.  ఎమోషనల్‍గా ఉన్న చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కమర్షియల్‍గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 


ఇక ‘యానిమల్‌’ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. ‘బాహుబలి-2’, ‘కబీర్ సింగ్’ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా ప్రారంభంలో స్త్రీ పాత్రలను బలంగా చూపించినా, చివరకు శృంగార బొమ్మలా చూపించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా, కీడు కలిగించే అవకాశం ఉందని వెల్లడించింది.
 


దీనికి కౌంటర్ గా సందీప్ మాట్లాడుతూ...“నా సినిమాల గురించి విమర్శించే ఆమెను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. ఈ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయిదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ, అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరిచి విమర్శలు చేయడం మంచిది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది” అని సందీప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

click me!