సావిత్రి అంతిమయాత్ర రోజు చూసిన షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన మురళీ మోహన్‌.. ఇంట్రెస్టింగ్‌గా పేకాట కథ

Published : Apr 14, 2024, 10:47 AM ISTUpdated : Apr 14, 2024, 04:14 PM IST

సావిత్రి అంతిమయాత్ర రోజు చోటు చేసుకున్న సంఘటనని, తాను చూసిన షాకింగ్‌ విషయాన్ని సీనియర్‌ నటుడు మరళీ మోహన్‌ బయటపెట్టాడు.   

PREV
19
సావిత్రి అంతిమయాత్ర రోజు చూసిన షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన మురళీ మోహన్‌.. ఇంట్రెస్టింగ్‌గా పేకాట కథ

మహానటి సావిత్రి సౌత్‌ సినిమాని ఊపేసిన నటి. నటనలో మహా నటిగా ఎదిగిన ఆమె స్టార్‌డమ్‌లోనూ స్టార్‌ హీరోలను మించిపోయింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, జెమినీ గణేషన్‌ వంటి బిగ్‌స్టార్స్ కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్‌ చేసే వాళ్లంటే ఆమె రేంజ్‌ ఏ స్థాయిలో, ఎంతటి బిజీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 
 

29

జెమినీ గణేషన్‌తో ప్రేమ, పెళ్లి బంధం ఆమె కెరీర్‌ని నాశనం చేసిందని, అతని కారణంగా ఆమె మద్యానికి, పేకాటకి బానిసైందని అంటుంటారు. వరుస పరాజయాలు, నిర్మాతగా ఫెయిల్యూర్స్, ఆర్థిక ఇబ్బందులు, ఐటీ దాడులు వంటివి ఆమె జీవితాన్ని, కెరీర్‌ని దెబ్బకొట్టాయని `మహానటి` సినిమాలో చూపించారు మేకర్స్. రియల్‌ లైఫ్‌లోనూ జరిగింది అదే అనేది ఆమెని దగ్గరుండి చూసిన వాళ్లు చెప్పేమాట. 
 

39

సావిత్రి జీవితాన్ని కొంత వరకు దగ్గరుండి చూసిన వారిలో సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ కూడా ఉన్నారు. తాజాగా ఆయన పలు ఇంట్రెస్టింగ్‌, మరికొన్ని షాకింగ్‌ విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా అంతిమయాత్ర సమయంలో ఆయన చూసిన సంఘటన తనని కలచివేసిందన్నారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మురళీ మోహన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 

49

జెమినీ గణేషన్‌ కారణంగానే ఆమె జీవితం నాశనం అయ్యిందని, తాగుడుకి బానిసైందని, దీంతో అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. సావిత్రితో తాను బాగానే సినిమాలు చేశానని, ఆమెతో మంచి క్లోజ్‌ ర్యాపోపెరిగిందని చెప్పారు. అయితే ఆరు గంటల తర్వాత ఆమెకి షూటింగ్‌ చేయడం నచ్చదట. కార్డ్స్(పేకాట) ఆడుదాం రండి అని పిలిచేదట. అలా గంటలు గంటలు పేకాట ఆడేదట. ఆమె బాగా ఇన్‌వాల్వ్ అయి ఆడేదని, దీంతో తాము కూడా తమ ఆట అయినా షో కొట్టేవాళ్లం కాదని, ఆమెకి ఏదో ఒకటి వేస్తూ ఉండే వాళ్లమని, చివరికి ఆమె ఆట ముగించేదట. 
 

59

దీంతో అబ్బా జస్ట్ మిస్‌ అంటూ కలరింగ్‌ ఇచ్చేవాళ్లట. ఆమె అలా చేయడం సరదాగా ఉండేదని తెలిపారు మురళీమోహన్‌. అయితే తన గేమ్‌ అయిపోయాక అయ్యో అప్పుడే తొమ్మిదయ్యిందా? తాను ఆరుగంటలకు వెళ్లిపోతా అన్నాను కదా అంటూ గాబరా పడిపోయదట. చాలా చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పారు. 
 

69

ఈ సందర్భంగా మరో షాకింగ్‌ విషయాన్ని పంచుకున్నారు. ఓ సినిమా బెంగుళూరులో షూటింగ్‌ అవుతుందని,తన షూట్‌ అయిపోవడంతో తాను ఫ్లైట్‌ కోసం వెళ్తున్నారట. అక్కడ లిఫ్ట్ లో వెళ్దామని చూడగా, అందులో సావిత్రి ఉన్నారట. ఆమె తెల్ల చీర కట్టుకుని చక్కగా ఉన్నారట. ఏంటి అమ్మా ఇక్కడ ఉన్నారంటే రేపటి నుంచి తనకు సినిమా షూటింగ్ లు ఉన్నాయి, బిజీ అవుతాని, ఫ్రెండ్స్ చిన్న పార్టీ అన్నారు, వెళ్తున్నా అని చెప్పిందట. సరే అమ్మా అని, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు, ఇదే మెయింటేన్‌ చేయండి అని చెప్పి మురళీ మోహన్‌ వెళ్లిపోయారట. 
 

79

కట్‌ చేస్తే మార్నింగ్‌ న్యూస్‌.. సావిత్రి డయాబెటిక్‌ కోమాలోకి వెళ్లిపోయిందనే వార్త వచ్చింది. ఆ రోజు రాత్రి పార్టీ ఆమె మందు తీసుకోవడం వల్లే అని చెప్పకనే చెప్పారు. అది అలవాటు చేసింది మాత్రం జెమినీ గణేషనే అని, `మహానటి` సినిమాలో  చూపించింది నిజమే అని వెల్లడించారు మురళీ మోహన్‌. అప్పుడు కోమాలోకి వెళ్లిన ఆమె మళ్లీ కోలుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా మరో షాకింగ్‌ విషయాన్ని ఆయన షేర్‌ చేసుకున్నారు.
 

89

ఏఎన్నార్‌, దాసరి నారాయణరావు, నేను కలిసి హైదరాబాద్‌లో `ప్రేమాభిషేకం` సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నామని, ఆ సమయంలో ఇలా సావిత్రి చనిపోయారనే వార్త వచ్చిందని, దీంతో తమ మనసు కలిచి వేసిందన్నారు. ఆ వెంటనే దాసరి, ఏఎన్నార్‌ మాట్లాడుకుని ఆమెని చూద్దామని చెన్నైకి వెళ్లారట. ఫ్లైట్‌ డిలే కారణంగా లేట్‌ అయ్యిందని, అప్పటికే ఆమె భౌతికకాయాన్ని తీసుకెళ్తున్నారని, ఆ సమయంలో ఆమె వెంట మహా అయితే పది మంది మాత్రమే ఉన్నారని, వాళ్లు కూడా ఆమె బంధువులు, సన్నిహితులు మాత్రమే అని, వారితోపాటు పనివాళ్లు ఉన్నారని, వాళ్లు సావిత్రమ్మ అంటూ భోరున విలపిస్తున్నారని చెప్పారు. 

99

సావిత్రి అంతిమయాత్ర సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఒక్కరు కూడా లేరని, కడసారి చూసేందుకు కూడా ఎవరూ రాలేదని అది తమ గుండెని బరువెక్కించిందన్నారు. ఏఎన్నార్‌, దాసరి, తాను మాత్రమే చివరి కార్యక్రమం జరిగే వరకు ఉండి వచ్చామని తెలిపారు మురళీమోహన్‌. నటనతో కోట్ల మంది హృదయాలను ఆకట్టుకుంది, అద్భుతమైన నటిగా విశేష ఆదరణ పొందింది, ఎంతో అద్భుతమైన సినిమాల్లో భాగమైంది, ఎంతో మందికి సాయం చేసిన సావిత్రిని కడసారి చూసేందుకు ఇండస్ట్రీ దూరంగా ఉండటం అత్యంత విచారకరం. కొన్నేళ్లు కోమాలో ఉన్న ఆమె 1981 డిసెంబర్‌ 26న కన్నుమూశారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories