చాలామంది సినిమా వాళ్లు కెరీర్ స్టార్ట్ అయ్యి, ఓ రెండు మూడు అవకాశాలు రాగానే , వచ్చిన సంపాదనతో ప్రాపర్టీస్ ప్లాన్ చేస్తారు, బిజినెస్ లు చేస్తారు, భూములు కొంటారు. కాని ఇండస్ట్రీలో 25 ఏళ్లు హీరోగా ఉన్నా.. సొంత ఇల్లు కూడా కొనలేదట ఈ సెలబ్రిటీ. ఇంతకీ ఎవరతను?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ చేసే పని అదే. వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే ఆ రేమ్యునరేషన్ తో ఇల్లు, బిజినెస్ లు, ప్రాపర్టీలు కొని, లైఫ్ ను సెక్యూర్ జోన్ లో పెడుతుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత సపాదించినా చివరకు సొంత ఇల్లు కూడా కొనలేకపోతుంటారు. అలాంటి హీరో గురించి ఇప్పుడు చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు సిద్దార్ద్.