శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు జంటగా హాజరైన సిద్ధార్థ్ - అదితి.. కన్ఫమ్ చేసినట్టేగా?

First Published | Jan 26, 2023, 5:56 PM IST

కొద్దిరోజులుగా హీరో సిద్దార్థ్ - అదితి రావ్ హైదరి ప్రేమలో మునిగితేలుతున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు వీరిద్దరూ జంటగా హాజరై షాకిచ్చారు. దీంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.
 

లవర్ బాయ్ గా పేరున్న టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddharth)  ప్రస్తుతం హైదరాబాద్ బ్యూటీ  అదితి రావు హైదరి (Aditi Rao Hydari)తో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెగ ప్రచారం జరిగింది.
 

గతంలో ముంబైలోని ఓ హోటల్ లో ఇద్దరు కలిసి కెమెరా కంటికి చిక్కారు.. ఇక సోషల్ మీడియాలోనూ సిద్ధార్థ్ అదితి బర్త్ కు పెట్టిన పోస్టులు, ధరించే దుస్తులతోనూ వారి రిలేషన్ గురించి హిట్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్నటి వరకు రూమర్లు ఇలా వచ్చాయి. వీటిపై ఎవరూ స్పందించలేదు.


తాజాగా సిద్ధార్థ్ - అదితి రావు హైదరి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు నెట్టింట పుకార్లు షికారు చేస్తుండగా.. తాజాగా వాటికి బలం చేకూర్చారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ లో తాజాగా వీరిద్దరూ మెరిశారు. జంటగా శర్వా రక్షితతో ఫొటోలు కూడా దిగారు.
 

 వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి ఇలా ఓపెన్ అవుతున్నారేమో అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏకం కపుల్ లాగే దర్శనమిచ్చారని అంటున్నారు. దీంతో వేడుకలో పాల్గొన్న వీరిద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంథింగ్ సంథింగ్ నిజమేనా? అని షాక్ అవుతున్నారు. 

అయితే, గతంలో సిద్ధార్థ్ ఆయా హీరోయిన్లతో డేటింగ్ చేశారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా  సమంత, శ్రుతి హాసన్ తో డేటింగ్ చేశారని, కొన్ని కారణాలతో మళ్లీ విడిపోయారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు అదితితో ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా? లేదంటే డేటింగ్ తో ముగుస్తుందా? అన్నది చూడాలి. ఇంకా దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.
 

 ఇక శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘మహాసముద్రం’లో అదితి రావ్ హైదరీ హీరోయిన్ గా నటించింది. అప్పుడే వీరిద్దరి ప్రేమకు పునాది పడిందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ ఇలా ఓపెన్ గా ఫంక్షన్లకు హాజరు కావడంతో మరోసారి వార్తలో నిలిచారు. దీనిపై మున్ముందు ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest Videos

click me!