చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు
ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్వేతా బసు ప్రసాద్. చిన్న వయసులోనే బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ జీవిత ప్రయాణం అనేక మలుపులతో నిండి ఉంది. 10 ఏళ్ల వయసులోనే జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న ఆమె, ఆతరువాత కాలంలో ఓ వివాదంలో చిక్కుకొని, మూవీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయింది. 2002లో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘మక్దీ’ ద్వారా శ్వేతా బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టింది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘కహానీ ఘర్ ఘర్ కీ’ సీరియల్ ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది.