కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా...తన సొంత టాలెంట్ మీద.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది శ్రుతి హాసన్. హీరోయిన్ గా మాత్రమే కాకుండా మల్టీ టాలెంట్ చూపిస్తుంది శ్రుతి. మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోయిన్ గా, సింగర్‌గా.. ఇలా అన్ని రంగాల్లోనూ తన సత్తా చాటుకుంది.
అందం. ఆకర్షణ కలిసి ఉన్న కోలీవుడ్ భామకు భారీ ప్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. క్రాక్ వకీల్‌సాబ్ లాంటి హిట్ సినిమాలు అందుకున్న ఈ బ్యూటీ... ఈ ఏడాది ఏకంగా మూడు పెద్ద సినిమాల్ని లైన్‌లో పెట్టుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సీనియర్ హీరో బాలయ్య సరసన హీరోయిన్ గా ఆడిపాడబోతోంది బ్యూటీ.
మరో వైపు మెగాస్టార్ చిరంజీవి సరసన బాబీ డైరెక్ట్ చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ సలార్ లోనూ సందడి చేయబోతోంది శృతి హాసన్.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఫారెన్ ప్రేమికుడితో బ్రేకప్ చెప్పిన తరువాత చాలా కాలం ఖాళీగా ఉన్న శ్రుతి ప్రస్తుతం శాంతను హజారికా తో కలిసి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కలిసి హ్యాపీగా షికార్లు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసుకుంటూ..సందడిచేస్తున్నారు ఇద్దరు.
అయితే ఈ క్రమంలోనే శృతి హాసన్ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆమె డిఫరెంట్ గా సమాధానం ఇచ్చింది. పెళ్ళెప్పుడు అని శ్రుతిని అడగ్గా.. దానికి సమాధానమిస్తూ, పెళ్ళంటేనే భయమేస్తోంది.... నా తల్లిదండ్రుల పెళ్ళి విడాకులకు దారితీసిందని నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ, నాలో పెళ్లి అంటే అదోరకమైన భయం ఏర్పడుతోంది అని అంటోంది శ్రుతి.
పెళ్ళిపై తనకు నమ్మకం ఉంది అంటోంది.. కాని పెళ్ళంటే ఎందుకో.. లోలోపల భయం మాత్రం ఉంది. పైగా శాంతను నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక విషయాల్లో మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి అని వివరించింది శ్రుతి హాసన్.
ప్రస్తుతం శ్రుతి స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి రకరకాలుగా నెటిజెన్స్ స్పందిస్తున్నారు. మరి పెళ్ళి చేసుకోకుండా శ్రుతి ఎంతకాలం శాంతనుతో సహజీవనం చేస్తుందో అని చర్చించుకుంటున్నారు. శాంతనూపై అంత నమ్మకం కుదిరినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారు.