Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దేవి (Devi) మాధవ (Madhava) ను అమ్మ మా అమ్మ కాదని ఎందుకు అబద్దం చెప్పావు అని అడుగుతుంది. నేను ఆరోజు చిన్మయి గురించి చెప్పుకుంటూ బాధపడ్డాను అని మాధవ కవర్ చేసుకుంటాడు. ఇక దేవి నాకు తెలియక నేను అమ్మను చాలా బాధ పెట్టాను అని అంటుంది.
26
ఆ తర్వాత మాధవ (Madhava) రాధ ప్రవర్తనను గమనించి ఎట్టి పరిస్థితిలో తనను ఇంటి నుంచి బయటకు పోనివ్వ కూడదు అని అనుకుంటాడు. మరోవైపు బాషా (Bhasha), కమలలు సత్య బాధను తెలుసుకొని వాళ్ళు బాధ పడుతూ ఉంటారు. ఒకవైపు ఆదిత్య, రుక్మిణి లు ఒకచోట కలుసుకుంటారు.
36
సత్య (Sathya) కు పిల్లలు పుట్టరని తెలిసి నాకు లావణ్య అత్త వేరే పెళ్లి చేయడానికి సిద్ధమైంది అని ఆదిత్య (Adithya) రుక్మిణికి చెబుతాడు. ఇక నాకంటూ ఏం దక్కింది రుక్మిణి అంటూ ఆదిత్య తన బాధనంతా రుక్మిణి ముందు వెళ్లగక్కుతాడు. ఆ మాటకు రుక్మిణి ఎంత బాధ పడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
46
ఒకవైపు మాధవ (Madhava) రాధ ప్రశ్నించే స్థాయి నుంచి నన్ను బెదిరించే స్థాయికి వచ్చింది. ఇక రాధ (Radha) నాకు దూరం కాకూడదు.. ఊర్లో వాళ్ళ ముందు నా పరువు పోకూడదు అని మాధవ ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య.. రుక్మిణి నాకు ఎందుకు తనలో బాధ చెప్పుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు.
56
మరోవైపు జానకి (Janaki) ఊర్లో వారి అందరి దృష్టిలో రాధ (Radha) మన కోడలు అయింది. కానీ మన దృష్టిలో మాత్రం రాధ కోడలు కావడం లేదు అని తన భర్తతో చెబుతుంది. ఇక మనకు అదృష్టం లేదేమో అని జానకి భర్త దాని గురించి మాట్లాడకు అని అంటాడు.
66
ఆ తర్వాత రుక్మిణి (Rukmini) తన చెల్లి సత్య బాధను తెలుసుకొని ఎలాగైనా దేవిని నా పెనిమిటి చేతిలో పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇక నేను కూడా ఇంట్లో నుంచి బయటపడాలి అని అనుకుంటుంది. ఇక దేవి (Devi) మా స్కూల్లో స్కవ్ టింగ్ కి తీసుకుని వెళుతున్నారు. మేము కూడా వెళ్తాము అని అనగా రుక్మిణి దానికి తిరస్కరిస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.