Shruti Haasan:శృతి హాసన్ డేరింగ్... అలా కనిపించి షాక్ ఇస్తున్న బోల్డ్ బ్యూటీ

Published : Mar 03, 2022, 05:53 PM ISTUpdated : Mar 03, 2022, 05:57 PM IST

శృతి హాసన్ డేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవడు ఏమనుకున్నా నచ్చినట్లు బ్రతికేస్తుంది ఈ చెన్నై సుందరి. ఎఫైర్స్, రిలేషన్స్ కూడా అంతా ఓపెన్ అని చెప్పాలి. మిగతా హీరోయిన్స్ వలె దాచుకోవడం, రహస్యంగా మైంటైన్ చేయడం ఉండదు.

PREV
17
Shruti Haasan:శృతి హాసన్ డేరింగ్... అలా కనిపించి షాక్ ఇస్తున్న బోల్డ్ బ్యూటీ

కాగా శృతి హాసన్ (shruti haasan)ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె డీగ్లామర్ లుక్ లో షాకిస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ మేకప్ లేకుండా కనిపించడానికి ఇష్టపడరు. శృతి మాత్రం అందుకు భిన్నం. తన డీగ్లామర్ లుక్ షేర్ చేస్తూ షాక్ ఇస్తుంది. శృతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

27

ఇక శృతి కెరీర్ మరలా స్వింగ్ లోకి వచ్చింది. ఆమె పెద్దగా ప్రయత్నాలు చేయకుండానే క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది శృతి హాసన్. టాలీవుడ్ టాప్ స్టార్ బాలయ్యకు జంటగా ఆయన నెక్స్ట్ మూవీలో ఆఫర్ పట్టేసింది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే

37

ఇక ఈ మూవీ షూటింగ్ సైతం జరుపుకుంటుంది. తనకు కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో శృతి హాసన్ ని వదలడం లేదు దర్శకుడు గోపీచంద్ మలినేని. శృతితో ఆయనకు ఇది హ్యాట్రిక్ చిత్రం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ భారీ విజయాలు నమోదు చేశాయి.

47

ఇక హీరో ప్రభాస్ (Prabhas) తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ షూటింగ్ జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన శృతి హాసన్ కి సలార్ ఆఫర్ దక్కడం అదృష్టమే అని చెప్పాలి. కెజిఎఫ్ మూవీతో స్టార్ హీరోలు సైతం తన వైపు తిరిగేలా చేసుకున్న ప్రశాంత్ నీల్, సలార్ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. 

57

కెరీర్ మెల్లగా గాడినపడుతుందన్న ఆనందం ఒకవైపు... జీవితానికి తోడు దొరికిందన్న సంతోషం మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.  శృతి ప్రస్తుతం తన కొత్త ప్రియుడు శాంతను హజారిక ప్రేమలో మునిగి తేలుతున్నారు. అతనితో పాటు ముంబైలో మకాం పెట్టిన శృతి, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు. 

67

ఆ మధ్య జరిగిన చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకలో సైతం శాంతను పాల్గొన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ హాజరైన ఈ పార్టీలో శాంతనును శృతి హాసన్ అందరికీ పరిచయం చేశారు. విషయం ఇంత వరకు రావడంతో పెళ్లే తరువాయి అన్న మాట వినిపిస్తుంది.

77

 
గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో శృతి రెండేళ్లకు పైగా డేటింగ్ చేశారు. అనంతరం 2019లో విడిపోయారు. మైఖేల్ చెన్నైలోని కమల్ నివాసానికి పలుమార్లు రావడం విశేషం. మరి శాంతను రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. 

click me!

Recommended Stories