రీతూ వర్మ 2013నుంచి తన కేరీర్ లో యాక్టివ్ గా ఉంటోంది. తెలంగాణకు చెందిన హీరోయిన్ కు యూత్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ పోతోంది. బాద్షా, ప్రేమ కాదల్ ఈష్క్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించడంతో కాస్తా పాపులర్ కాలేకపోయింది.