మీ ప్రేమకు సాటిలేదు.. కమల్ కోసం కూతురు శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్

Published : Nov 07, 2025, 02:15 PM IST

ఇండియన్ స్టార్ హీరో, లోకనాయకుడు  కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా  ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కూతురు శ్రుతిహాసన్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

PREV
14
శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక  ఎమోషనల్  పోస్ట్ ను షేర్  చేసింది. 'నాకు ఇష్టమైన వ్యక్తి', 'అద్భుతమైన నాన్న' అని పేర్కొంటూ, ఒక అందమైన వీడియోను పంచుకుంది స్టార్ హీరోయిన్.

24
అద్భుతమైన నాన్నకు..

శ్రుతి హాసన్ పోస్ట్ లో ఏముందంటే.. "నాకు ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మ్యాజిక్, ప్రకాశానికి ఏదీ సాటిరాదు. మీరు కలలు కంటూనే ఉండాలి' అని శ్రుతి హాసన్ తన తండ్రికి విషెష్ చెప్పింది. 

34
கமல்ஹாசனின் திரைப்பயணம்

కమల్ హాసన్ 1959లో 'కలత్తూర్ కన్నమ్మ'తో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. ఈసినిమాలో కమల్ తల్లిగా మహానటి సావిత్రి నటించారు. కమల్ మొదటి సినిమాకే  రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. నటుడే కాక, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు భాషల్లో పనిచేశారు.

44
4 జాతీయ అవార్డులు..

కమల్ హాసన్ తన కెరీర్ లో 4 జాతీయ అవార్డులు, 15కు పైగా ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం 'మూడు సినిమాల్లో నటిస్తూ..  రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories