Published : Nov 07, 2025, 12:34 PM ISTUpdated : Nov 07, 2025, 12:50 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ లో కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి మహేష్ మూవీతో హాలీవుడ్ మార్కెట్ లో సైతం పాగా వేయాలని జక్కన్న ప్రయత్నిస్తున్నారు.
25
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రపంచాన్ని తిరిగి వచ్చే సాహసికుడిగా మహేష్ బాబు నటిస్తున్నారు. స్టోరీ థీమ్ ఏంటనేది పూర్తిగారాజమౌళి ఇంకా బయట పెట్టలేదు. కానీ ఆఫ్రికా అడవుల నేపథ్యం, అందులో హిందూ పురాణాలకు సంబంధించిన అంశాలు ఉండబోతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన తొలి రివీల్ ఉండబోతోంది. దీనిని జక్కన్న కనీవినీ ఎరుగని విధంగా ప్లాన్ చేస్తున్నారు.
35
భారీ ఈవెంట్ కి ఏర్పాట్లు
రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసారం చేసేందుకు జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారా ? లేక టీజర్ లాంటి సర్ప్రైజ్ ఉంటుందా ? అనేది కూడా క్లారిటీ లేదు. ఈ సినిమా తొలి అప్డేట్ కోసమే రాజమౌళి ఇంత ప్లాన్ చేస్తున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం అవుతోంది. నవంబర్ 15 దగ్గర పడుతున్న సమయంలో రాజమౌళి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ వారం మొత్తం SSMB 29 అప్డేట్స్ ఉంటాయని తాజాగా ట్విట్టర్ లో ప్రకటించారు.
ఈ చిత్ర క్లైమాక్స్ గురించి రాజమౌళి కామెంట్స్ చేశారు. 'భారీ ఎత్తున క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. క్లైమాక్స్ షూటింగ్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ ముగ్గురూ పాల్గొంటున్నారు. మరోవైపు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాం. మీరంతా దీనిని ఎక్స్పీరియన్స్ చేసేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా. ఈవెంట్ జరిగే వరకు ఈ వారం ఆసక్తికర అప్డేట్స్ వస్తుంటాయి. ఈ రోజు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం' అని రాజమౌళి ఎక్స్ లో ప్రకటించారు. ఇంతలోనే మహేష్ బాబు తన ఎక్స్ వేదికపై పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
55
అవిటివాడే కానీ రాక్షసుడు
పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. పృథ్వీరాజ్ పాత్ర పేరు కుంభ అని మహేష్ రివీల్ చేశారు. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో అవిటివాడిలా నటిస్తున్నారు. అవిటివాడు అయినప్పటికీ ఒక రోబోటిక్ వీల్ చైర్ లో కూర్చుని.. నాలుగు చేతుల రాక్షసుడిలా కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్ర ఈ మూవీలో ఎంత బలంగా ఉండబోతోంది చెప్పడానికి ఇదే ఉదాహరణ. మొత్తంగా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం.
పృథ్వీరాజ్ కుంభ ఫస్ట్ లుక్ ని రాజమౌళి కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రిథ్వీరాజ్ తో ఈ సినిమాలో ఫస్ట్ షాట్ చిత్రీకరించిన వెంటనే నేను అతడి వద్దకు వెళ్లి.. నేను చూసిన గొప్ప నటుల్లో నువ్వు కూడా ఒకడివి అని చెప్పా. ఈ పవర్ ఫుల్, రూత్ లెస్, భయంకరమైన పాత్రకి ప్రాణం పోసినందుకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో నటిస్తున్నందుకు పృథ్వీరాజ్ కి ధన్యవాదాలు అని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళికి పృథ్వీరాజ్ రిప్లై ఇచ్చారు. మీ దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఇంకా మిగిలి ఉన్న మ్యాడ్ రైడ్ కోసం ఎదురుచూస్తున్నా సార్ అని పేర్కొన్నారు.