శనివారం టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు హాజరైన శృతి హాసన్ బాలయ్య(Balakrishna) తో పాటు వేడుకలో సందడి చేశారు. తనకు కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో శృతి హాసన్ ని వదలడం లేదు దర్శకుడు గోపీచంద్ మలినేని. శృతితో ఆయనకు ఇది హ్యాట్రిక్ చిత్రం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ భారీ విజయాలు నమోదు చేశాయి.
త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లనుంది.