Shivani Rajashekar: డిప్రెషన్‌ గురించి ఓపెన్‌ అయిన రాజశేఖర్‌ తనయ.. బ్యాడ్‌ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

First Published Nov 15, 2021, 4:28 PM IST

హీరో రాజశేఖర్‌ కూతుళ్లు శివానీ రాజశేఖర్‌, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు. పెద్ద కూతురు శివానీ డిప్రెషన్‌కి గురైందట. ఆ సమయంలో తాను తీవ్ర డిప్రెషన్‌కి గురైనట్టు చెప్పింది. తాను కూడా డిప్రెషన్‌కి గురైనట్టు చెప్పి షాకిచ్చింది. 

రాజశేఖర్‌(Rajashekar) చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌గా దూసుకుపోతుంది. కానీ పెద్ద కూతురు శివానీ(Shivani Rajashekar) నటించిన సినిమాలు మాత్రం పురిటి నొప్పులను అనుభవిస్తున్నాయి. షూటింగ్‌లు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోవడం, వాయిదా పడటం జరుగుతూ వస్తున్నాయి. దీంతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఖరారై మూడేళ్లు అవుతున్నా.. ఇంకా ఇప్పటి వరకు Shivani Rajashekar సినిమాలు విడుదల కాలేదు. శివానీ హీరోయిన్‌గా పరిచయమవుతూ నటించిన `టూ స్టేట్స్` చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. మరో సినిమా అనేక మార్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో శివానీ కెరీర్‌ ప్రారంభంలోనే సస్పెన్స్ లో పడింది. అయితే ఈ సందర్భంగా తాను అనుభవించిన హార్డ్ డేస్‌ గురించి పంచుకుంది శివానీ. 
 

శివానీ హీరోయిన్‌గా నటించిన మరో సినిమా `అద్భుతం`(Adhbutham). మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ నెల 19న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ శివానీ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్‌లోని స్ట్రగుల్స్ ని పంచుకుంది. 
 

బాలీవుడ్‌లో సక్సెస్‌ సాధించిన `2స్టేట్స్` చిత్రాన్ని తెలుగులో రీమేక్‌తో శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది. దీనికి సంబంధించిన అంతా రంగం సిద్ధమైంది. అడవి శేషు హీరోగా ఈ సినిమా పట్టాలెక్కింది. గ్రాండ్‌గా ఓపెనింగ్‌ కూడా జరుపుకుంది. కొన్ని రోజులపాటు చిత్రీకరణ జరిగింది.కానీ మధ్యలో నెలకొన్న క్రియేటివ్‌ డిఫరెన్స్ వల్ల సినిమా ఆగిపోయింది. దీంతో ఆదిలోనే శివానీ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి. 

ఆ తర్వాత తమిళంలో తన తొలి సినిమా విష్ణు విశాల్‌తో ఓకే అయ్యింది. ఆ సినిమా కూడా ఆగిపోయింది. దీంతో మరింతగా కుంగిపోయిందట శివానీ. మరోవైపు తెలుగులో ఆమె నటించిన మరో సినిమా `అద్భుతం`. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఇక ఈ సినిమా విడుదల కాదనే వార్తలు కూడా వచ్చాయి.

దీంతో మరోసారి తనకు అడ్డంకే ఎదురయ్యిందని బాగా ఫీల్‌ అయ్యిందట. తాను నటించిన సినిమాలన్నీ వరుసగా వాయిదా పడటం, రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యిందట. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. ఫ్రస్టేషన్‌తో ఏం చేయాలో అర్థం కాలేదని చాలా బాధపడినట్టు పేర్కొంది శివానీ. ఆ రోజులు తన జీవితంలో చాలా పెద్ద హార్డ్ డేస్‌ అని పేర్కొంది. అయితే అమ్మానాన్నలు(జీవిత, రాజశేఖర్‌) తనకు సపోర్ట్ గా నిలిచారని తెలిపింది. 

ఇదిలా ఉంటే ఇటీవల తన సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో తమ తాతగారు వరద రాజన్‌ చనిపోయారని, ఆయన తన చెల్లి శివాత్మిక సినిమా చూశాడని, కానీ తన సినిమాలు చూడలేదనే బాధగా ఉందని పేర్కొంది శివానీ. అది ఎప్పటికీ ఓ వెలితి ఉంటుందని పేర్కొంది. 
 

మరోవైపు ప్రస్తుతం `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` చిత్రంతోపాటు తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా, హిప్‌ హాప్‌ తమిళతో మరో సినిమాలో నటించినట్టు, అవి విడుదలకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. వరుసగా ఈ సినిమాలు విడుదలవుతుండటం ఆనందంగా ఉందని చెప్పింది. 

బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి శివానీ చెబుతూ, `స్టార్‌ కిడ్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. కెరీర్‌ ఆరంభంలోనే అవాంతరాలు ఎదురైతే ఇండస్ట్రీలో బ్యాడ్‌లక్‌, ఐరన్‌లెగ్‌ అనే ముద్రలు వేస్తుంటారు. ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోవడంతో నాకు నేనే ఐరెన్‌లెగ్‌గా భావించుకున్నా` అని పేర్కొంది శివానీ. 

అయితే తాము అందరిలాగే ఆడిషన్స్ ఇచ్చామని, అవకాశాలు మా ప్రయత్నాలు మేం చేసినట్టు చెప్పింది. తాను, చెల్లి శివాత్మిక చాలా ఆడిషన్స్ ఇచ్చినట్టు పేర్కొంది. తన మూడేళ్ల యాక్టింగ్‌ కెరీర్‌లో చాలా కొత్త విషయాలను నేర్చుకుందట. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని పేర్కొంది శివానీ. 

ఇదిలా ఉంటే `అద్భుతం` చిత్రంలో మొదట ఇతర హీరోయిన్లతో అనుకున్నారట. అందులో భాగంగా అవికా గోర్‌ని ఫస్ట్ కన్ఫమ్‌ చేశారట. కానీ బడ్జెట్‌ వైజ్‌గా కొత్త వాళ్లని తాసుకోవాలని భావించిన శివానీని అప్రోచ్‌ అయ్యారట. కథ విని తాను చాలా ఎగ్జైట్‌ అయ్యిందని, స్క్రిప్ట్ లో ఆమె పాత్రకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశామని, ఆమె పాత్రని పెంచినట్టు తెలిపారు దర్శకుడు మాలిక్‌ రామ్‌. 
 

ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది, తెలుగులో వస్తోన్న ఓ కొత్త రకమైన జోనర్‌ ఇదని, ఒకే నెంబర్‌ ఇద్దరికి ఉంటే ఏం జరిగింది. ఎలాంటి ఫన్నీ, రొమాంటిక్‌ సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సినిమా కథ అని, చాలా కొత్తగా ఉంటుందన్నారు దర్శకుడు రామ్‌ మాలిక్. శివానీ చాలా బాగా చేసిందని పేర్కొన్నారు. 

click me!