శృతి హాసన్ పట్టుచీరలో పద్ధతిగా మెరిసి ఎన్నిరోజులైందో.. చీరకట్టులో కట్టిపడేస్తున్న స్టార్ బ్యూటీ

First Published | Nov 3, 2023, 4:09 PM IST

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ చాలా రోజుల తర్వాత సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమిచ్చింది. పట్టుచీరలో పద్ధతిగా మెరిసి అభిమానులకు ఐఫీస్ట్ కలిగించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు కట్టిపడేస్తున్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan)  లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తన టాలెంట్ తో తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది.
 

ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో ఉన్న పెద్ద సినిమా ‘సలార్’ (Salaar). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న విషయం తెలిసిందే. చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ప్రమోషన్స్ ను జోరుగా ప్రారంభించనున్నారు. 
 


ఇక ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య‘, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో శృతి హాసన్ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ‘సలార్‘తో ఇక నెక్ట్స్ లెవల్ కు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. శృతిహాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన గురించి అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్  అందిస్తుంటారు. 

మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తుంటారు. లేటెస్ట్ ఫ్యాషన్ నూ పరిచయం చేస్తుంటుంది. మరోవైపు ట్రెండీ లుక్ తో స్టన్నింగ్ గా మెరుస్తుండేది. కానీ చాలా రోజుల తర్వాత ఈ స్టార్ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమిచ్చింది. 
 

అభిమానులు ఆమెను పద్ధతిగా చూసేందుకు చాలా ఇష్టపడుతుంటారు. తాజాగా పట్టుచీర, ఆకర్షణీయమైన జ్యూవెల్లరీ ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో అభిమానులకు కనుల విందు చేసింది. తన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. 

అటు సినిమాలు చేస్తుండటంతో పాటు పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ వస్తోంది. తాజాగా చైన్నైలోని ‘కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్’ కోసం యాడ్ షూట్ చేసింది. ఈ క్రమంలో పద్ధతిగా తయారై ఫొటోలకు ఫోజులిచ్చింది. శృతి ఇంతనిండుగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!