Polimera 2 Movie Review: `మా ఊరి పొలిమేర 2` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Nov 3, 2023, 2:21 PM IST

రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన `మా ఊరి పొలిమే` చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా (పార్ట్ 2)గా `పొలిమేర 2` వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకుందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

ఇటీవల అన్ని భాషల్లో సినిమాలు రెండు పార్ట్ లుగా రావడం ట్రెండ్‌గా మారింది. అందులో భాగంగా వచ్చిన చిన్న సినిమా `పొలిమేర 2`(మా ఊరి పొలిమేర 2). రెండేళ్ల క్రితం వచ్చిన `మా ఊరి పొలిమేర` చిత్రానికి రెండో భాగం. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా కామాక్షీ భాస్కర్ల నటించగా, బాలాదిత్య, హైపర్‌ ఆది, రాకేందు మౌళి, రవి వర్మ, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరి కృష్ణ నిర్మించారు. నేడు శుక్రవారం(నవంబర్‌3)న ఈ చిత్రం విడుదలైంది. ఓటీటీలో విడుదలైన మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. దీంతో రెండో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి, పైగా గీతా ఆర్ట్స్ విడుదల చేస్తుండటంతో సినిమా స్థాయి పెరిగిపోయింది. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
ఊర్లో చేతబడి చేస్తున్నారనే నిందతో కొమరయ్య(సత్యం రాజేష్‌)ని కొందరు కొట్టి చంపారనే ఆరోపణలతో కోర్ట్ లో కేసు వేస్తాడు తమ్ముడు(బాలాదిత్య). తను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌. అయితే ఆ కేసు మిస్టరీని తనే ఇన్వెస్టిగేషన్‌ చేస్తాడు. ఈక్రమంలో అనూహ్యంగా కోర్ట్ తీర్పు వచ్చే రోజే ఆ కేసుని వాపస్‌ తీసుకుంటాడు. కారణం తన అన్న కొమురయ్యే బతికే ఉన్నాడని, ఆ రోజు మంటల్లో పడి చచ్చిపోయింది అన్న కాదనే నిజం తెలుసుకుంటాడు. ఆ చేతబడి చేసింది కూడా నిజమే అనే విషయాన్ని అటు బలిజయ్య(హైపర్‌ ఆది), వదిన, కొమురయ్య భార్య( కామాక్షి)కి చెబుతాడు. తన అన్న ఏమైయ్యాడని వెతికేందుకు బాలాదిత్య జాబ్‌కి లీవ్‌ పెట్టి మరి వెళ్లిపోతాడు. మరోవైపు ఊర్లో వరుసగా సర్పంచ్‌లు చనిపోతుంటారు. మరోవైపు ఊరు చివరన ఉన్న గుడి చాలా కాలంగా మూసివేసిఉంటుంది. దాని వల్ల ఊరికి అరిష్టం జరుగుతుందని, జనాలు చనిపోతున్నారని టెంపుల్‌కి తాళం వేస్తారు? ఈ క్రమంలో ఊర్లోకి కొత్తగా ఎస్‌ఐ(రాకేందు మౌళి) వస్తాడు, అటు కానిస్టేబుల్‌ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? మరోవైపు కొమురయ్య ఏమయ్యాడు? ఆయన ఎందుకు చేతబడి చేశాడు? ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్‌ చేపడతాడు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతుంటాయి. మరి అవేంటి? ఈ మిస్టరీలకు కారణం ఏంటి? అనంతరం ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
చేతబడుల నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా `మా ఊరి పొలిమేర 2`ని రూపొందించారు దర్శకుడు అనిల్‌. మొదటి భాగం `పొలిమేర` ఓటీటీలో విశేష ఆదరణ దక్కడంతో సీక్వెల్‌ని తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది. మొదటి భాగానికి మించి లేదని స్పష్టమైంది. ఫస్ట్ పార్ట్ లో కొన్ని బూతు సీన్లు, డైలాగులు, శృంతిమించిన కంటెంట్‌ ఉండటం కూడా కొంత ఆకట్టుకోవడానికి కారణం. కానీ రెండో పార్ట్ లో మాత్రం ఆ వైపు వెళ్లలేదు. చాలా నీట్‌గా తెరకెక్కించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యేలా చేశారు. దీనికితోడు ఇటీవల మతానికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందని, ఆథ్యాత్మిక పరమైన అంశాలు బాగా పాపులర్‌ అవుతున్నాయి. అలాంటి సినిమాలు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. `కార్తికేయ 2` అలానే పెద్ద హిట్‌ అయ్యింది. ఆ కోవలోనే `పొలిమేర2` వచ్చింది. 
 

అయితే సినిమాని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కథని ఆడియెన్స్ కి చెప్పడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడు. కానీ ఎలా చెబుతున్నాం, ఆడియెన్స్ కి ఆసక్తికరంగా చెబుతున్నామా? వారిని ఎంగేజ్‌ చేసేలా చేస్తున్నామా? అనేది చూసుకోలేకపోయాడు. కథని ముందుకి వెనక్కి ఫ్లాష్‌ బ్యాక్‌లతో నడిపించాడు. కథ నీట్ గా చెప్పే ప్రయత్నం చేసినా, ఇలా ముందుకి వెనక్కి సస్పెన్స్ తో చెప్పడం, మితి మీరిన ప్లాష్‌ బ్యాక్‌లను వాడటం కొంత కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తుంది. దీనితోడు స్లో నరేషన్‌ మరింత చిరాకు తెప్పిస్తుంది. సస్పెన్స్ క్రియేట్‌ చేసే సన్నివేశాలకు సంబంధించి ఆర్‌ఆర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సీన్లలో లేకపోవడంతో అంత కిక్‌ ఇవ్వలేదు. పైగా ట్విస్ట్ ల కోసం ఫ్లాష్‌ బ్యాక్‌లు పెట్టుకోవడం, అవి థ్రిల్‌ చేయడం మనేసి సహనాన్ని పరీక్షించేలా చేస్తాయి. 

సినిమా క్లైమాక్స్ వరకు ఇలానే ముందుకి, వెనక్కి సాగుతుంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్ కొంత వరకు ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ కోసం మిగిలిన రెండు గంటలను సాగదీశాడు. నిజానికి `పొలిమేర` రెండు చిత్రాలు ఒక్క కథే, మొదటి భాగం ఫస్టాఫ్‌, రెండో భాగం సెకండాఫ్‌. కానీ రెండు వేర్వేరు సినిమాలుగా మార్చేశాడు దర్శకుడు. దీంతో కథని సాగదీయాల్సి వచ్చింది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. కథలో బలం లేకపోవడంతో, ముందుకి వెనక్కి తిప్పుతూ టైమ్‌ పాస్‌ చేశాడు, దీనికితోడు కథని ఒక్కో పాత్రవాటిని చెప్పిస్తూ మరింత లాగాడు. క్రిస్పీగా చేసి ఉంటే సినిమా ఎంగేజ్‌ చేసేది. దీంతో తొలిభాగం మారిదిగా ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దీనిలోనే అనేక అంశాలను సస్పెన్స్ లో పెట్టి మూడో పార్ట్ ని ప్రకటించడం గమనార్హం. 
 

నటీనటులుః
కొమురయ్యగా చేతబడులు చేసే పాత్రలో సత్యం రాజేష్‌ బాగా చేశాడు. చాలా వరకు సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఇరగ్గొట్టాడు. చాలా వరకు ఆయన్ని కామెడీ పాత్రల్లోనే చూస్తాం, కానీ ఇందులో నెగటివ్‌ యాంగిల్‌లో కనిపించి మెప్పించాడు. నటుడిగా తనలోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేశాడు. మరో షేడ్‌లో ఓపెన్‌ అయ్యాడు. కొమురయ్య భార్యగా కామాక్షి నటన ఆకట్టుకుంటుంది. ఆమె జీవించేంసింది. కానీ ఆమె ధరించే కాస్ట్యూమ్స్ కి, ఆమె పాత్రకి సింక్‌ కుదరలేదు. ఆ విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. ఇక హైపర్‌ ఆది సీరియస్‌ పాత్రలో మెరిశారు. పాత్రలో ఏదైనా మెప్పించాడు. ఎస్‌ఐగా రాకేందు మౌళి ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఎస్‌ఐ అనే ఫీల్‌ రాలేదు. చిత్రం శ్రీను, రవివర్మ మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపించాయి. చివర్లో పృథ్వీరాజ్‌ ఓ మెరుపు మెరిశారు. 
 

టెక్నీషియన్లుః
సినిమా టెక్నీకల్‌గా బాగుంది. గ్యానీ మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌ చాలా బాగుంది. చాలా వరకు ఎంగేజ్‌ చేసేలా ఉంది. కానీ సీన్లలో విషయం లేక ఆర్‌ఆర్‌ వేస్ట్ తేలిపోయిందనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. కుషేందర్‌ రమేష్‌ రెడ్డి విజువల్స్ విషయంలో అదరగొట్టాడు. ఫ్రేములు రిచ్‌గా ఉన్నాయి. శ్రీ వార ఎడిటింగ్‌కి మరింత పని చెప్పాల్సింది. చాలా కట్‌ చేయోచ్చు. అనవసరమైన బ్యాక్‌ స్టోరీలను లేపేయొచ్చు. ఇక దర్శకుడి కథలో విషయం ఉంది, దాన్ని ఎంగేజింగ్‌గా, క్రిస్పీగా చెబితే బాగుండేది, కానీ చిన్న కథని రెండు గంటలకుపైగా లాగడంతోనే ఇబ్బంది వచ్చి పడింది. కొత్త స్క్రీన్‌ప్లే పేరుతో చేసిన ప్రయోగం కొంత వరకు బెడిసి కొట్టింది. స్క్రీన్‌ ప్లే బ్రిలియన్సే ఇక్కడ తేడా కొట్టిందని చెప్పొచ్చు. సాధారణ ఆడియెన్స్ ని కన్‌ఫ్యూజ్‌ చేసేలా చేసింది. ఆ విషయంలో కేర్‌ తీసుకుంటే సినిమా ఫలితం బాగుండేది. 

ఫైనల్‌గాః క్లైమాక్స్ మాత్రమే బాగుంది. టైటిల్‌ మాదిరిగానే అంతదూరం(పొలిమేర) దాక వెళ్లాలంటే సహనం అవసరం. తొలి భాగంతో పోల్చితే తేలిపోయింది. 
రేటింగ్‌ః 2.5

click me!