Rakul Preeth Singh: అంతకు మించి తెగించకు... రకుల్ ప్రీత్ బోల్డ్ షోపై నెటిజెన్స్ హాట్ కామెంట్స్!

Published : Nov 03, 2023, 03:15 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్. గంటల తరబడి జిమ్ లో కష్టపడుతుంది. చెమటోడ్చి సాధించిన అందాలు దాచుకుంటే ఏం లాభం అనుకుందేమో కానీ సోషల్ మీడియా వేదికగా వడ్డించేస్తుంది.   

PREV
17
Rakul Preeth Singh: అంతకు మించి తెగించకు... రకుల్ ప్రీత్ బోల్డ్ షోపై నెటిజెన్స్ హాట్ కామెంట్స్!
Rakul Preeth Singh

టాలీవుడ్ ని ఏలిన టాప్ హీరోయిన్స్ లో రకుల్ ప్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో అమ్మడు జతకట్టింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఇక కన్నడ చిత్రం గిల్లీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. 

27
Rakul Preeth Singh

తెలుగులో మొదటి చిత్రం కెరటం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో బ్రేక్ వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. రకుల్ టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఆమెకు వరుస ఆఫర్స్ తలుపు తట్టాయి. 

 

37
Rakul Preeth Singh

ఎన్టీఆర్ కి జంటగా నాన్నకు ప్రేమతో చిత్రం చేసింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ రివేంజ్ డ్రామాలో లో రకుల్ విలన్ కూతురు పాత్ర చేసింది. నాన్నకు ప్రేమతో చిత్రానికి రకుల్ సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. 

47
Rakul Preeth Singh

రామ్ చరణ్ తో ధ్రువ, మహేష్ కి జంటగా స్పైడర్ మూవీ చేసింది. ధ్రువ హిట్ కాగా స్పైడర్ డిజాస్టర్ అయ్యింది. అంచనాల మధ్య విడుదలైన స్పైడర్ భారీ నష్టాలు మిగిల్చింది. రకుల్ క్యారెక్టర్ దర్శకుడు మురుగదాస్ కొత్తగా డిజైన్ చేశాడు. విలన్ డామినేషన్ ఎక్కవై మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 
 

57
Rakul Preeth Singh

ఇక అల్లు అర్జున్ తో సరైనోడు మూవీ చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు విజయం సాధించింది. టాలీవుడ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే అమ్మడు బాలీవుడ్ పై కన్నేసింది. గత నాలుగేళ్లుగా రకుల్ హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తుంది. అయితే టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు. 

 

67
Rakul Preeth Singh

గత ఏడాది రకుల్ కొండపొలం, చెక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలు పరాజయం పొందాయి. దాంతో రకుల్ కి తెలుగులో దారులు మూసుకుపోయాయి. హిందీలో మాత్రం అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి.

77
Rakul Preeth Singh


రకుల్ 2021లో జాకీ భగ్నానీ అనే వ్యక్తిని ప్రియుడిగా పరిచయం చేసింది. బాలీవుడ్ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నానీ రకుల్ మధ్య ఎఫైర్ నడుస్తుంది. ఏడాది కాలంగా రకుల్ పెళ్లి పుకార్లు తరచు వినిపిస్తున్నాయి. పెళ్లి కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. కుదిరినప్పుడు చెబుతాను. పదే పదే అడిగి విసిగించొద్దని రకుల్ గతంలో చెప్పారు. 
 

click me!

Recommended Stories