సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. ఓ ఫారెన్ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడింది శృతి హాసన్. అతడిని తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లి దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడితో విడిపోయింది.
కొంతకాలం సింగిల్ గా ఉన్న శృతి హాసన్ ప్రస్తుతం శంతను హజారికా అనే ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. తరచుగా ఈ శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లైఫ్ లో పాల్గొంటుండగా ఓ ఆకతాయి నెటిజన్ శృతి హాసన్ ని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్రేకప్ చేసుకున్నారు అని ప్రశ్నించాడు. దీనితో అతడి అసభ్యకరమైన ఉద్దేశం అర్థం చేసుకున్న శృతి అంతే ఘాటుగా బదులిచ్చింది. ఆ ఆకతాయి నోరు మూయించింది.
ఇంతకీ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పు.. ఎవరూ లేరనుకుంటాను. జీరో లేదా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుంది అని శృతి హాసన్ బదులిచ్చింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ఈ ఏడాది క్రాక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 చిత్రంలో నటిస్తోంది. 35 ఏళ్ల శృతి హాసన్ కొత్త ఏడాదిలో పెళ్లి కబురు చెబుతుందేమో చూడాలి. Also Read: చీరకట్టులో తమిళ చిన్నది.. మెస్మరైజింగ్ ఫోజులు చూడాల్సిందే