చీరకట్టులో తమిళ చిన్నది.. మెస్మరైజింగ్ ఫోజులు చూడాల్సిందే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 31, 2021, 05:02 PM IST

తన గ్లామర్ లుక్స్ లో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

PREV
16
చీరకట్టులో తమిళ చిన్నది.. మెస్మరైజింగ్ ఫోజులు చూడాల్సిందే

తన గ్లామర్ లుక్స్ లో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. 

26

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

36

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. అయితే హీరోయిన్ గా ఆమెకు ఓ భారీ విజయం కావాలి. 

46

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

56

తాజాగా నివేతా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది. చీరకట్టులో సంప్రదాయం ఉట్టిపడేలా నివేతా పేతురాజ్ ఫోజులు ఇచ్చింది. చీరకట్టులో ఆమె అందాల దేవతలా వెలిగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. తన స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

66

నివేతా ఇస్తున్న ఫోజులు, గ్లామర్ తో వెలిగిపోయే ఆమె ముఖం కుర్రాళ్ల చూపులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. నివేతా ప్రస్తుతం విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది.Also Read: పింక్ శారీలో హరివిల్లులా అనసూయ.. వయ్యారాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు

click me!

Recommended Stories