యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు (Jathirantnalu)సెన్సేషనల్ హిట్ అందుకుంది. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా నటించగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక రోల్స్ చేశారు. ఈ మూవీలోని 'చిట్టి నీ నవ్వంటే...' సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని రాధన్ కంపోజ్ చేశారు. రామ్ మిర్యాల అద్బుతంగా పాడగా.. చిట్టి సాంగ్ యూట్యూబ్ లో 121 మిలియన్ వ్యూస్ సాధించి మూడవ స్థానంలో నిలిచింది.