ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, విజువల్ గ్రాండియర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హనుమంతుడి బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుందట. టైమ్ ట్రావెల్ ఎలిమెంట్లు ఉంటాయని తెలుస్తుంది. దీనికి `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, ఇషా చావ్లా, సురభీ చిరుకి సిస్టర్స్ పాత్రల్లో మెరుస్తారని తెలుస్తుంది. వీరితోపాటు కునాల్ కపూర్, శ్రీ విష్ణు, రావు రమేష్, వెన్నెల కిశోర్, హర్షవర్థన్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.