జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. బుల్లితెరపై గ్లామర్ గా, ఫన్నీగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.