నిండైన చీరలో కట్టిపడేస్తున్న శృతి హాసన్.. హుందాగా కనిపిస్తూ మైమరపిస్తున్న బ్యూటీ

First Published May 24, 2024, 10:46 AM IST

లోక నాయకుడు కమల్ హాసన్ స్థాయిలో కాదు కానీ ఆయన వారసురాలిగా శృతి హాసన్ కూడా స్టార్ గా ఎదిగింది. గ్లామర్ హీరోయిన్ గా శృతి హాసన్ సౌత్ లో  అవకాశాలు అందుకుంటోంది.  

లోక నాయకుడు కమల్ హాసన్ స్థాయిలో కాదు కానీ ఆయన వారసురాలిగా శృతి హాసన్ కూడా స్టార్ గా ఎదిగింది. గ్లామర్ హీరోయిన్ గా శృతి హాసన్ సౌత్ లో  అవకాశాలు అందుకుంటోంది.  

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. 

అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. 

శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు.  

శృతి హాసన్ మోడరన్ డ్రెస్సులో ఎంత గ్లామర్ గా కనిపిస్తుందో.. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అంతే హుందాగా ఆకట్టుకోగలదు. తాజాగా శృతి హాసన్ నిండైన చీరకట్టులో మహాలక్ష్మిలా వెలిగిపోతోంది. 

శృతి హాసన్ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయినట్లు ప్రకటించింది. తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని స్వయంగా శృతి హాసన్ పేర్కొంది. దీనితో శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 

Latest Videos

click me!