ఏకాంతంగా ప్రియుడితో బిగ్ బాస్ పునర్నవి... 28 ఏళ్ల హ్యాండ్సమ్ కుర్రాడు ఎవరు?

First Published May 24, 2024, 10:35 AM IST

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం సడన్ షాక్ ఇచ్చింది. ఆమె తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడితో ఏకాంతంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. ఇంతకీ పునర్నవి లవర్ ఎవరు?
 

Punarnavi Bhupalam

2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది పునర్నవి భూపాలం. ఆ సూపర్ హిట్ మూవీలో అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. ఆమె ఫ్రెండ్  రోల్ లో అలరించింది. హీరోకి ఇష్టపడే అమ్మాయిగా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. 
 

అనంతరం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది... చిత్రాలు చేసింది. అయితే ఆమెకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. సీజన్ 3లో పాల్గొన్న పునర్నవి సత్తా చాటింది. ఆమె 11 వారాలు హౌస్లో ఉంది. 77వ రోజు ఎలిమినేట్ అయ్యింది. 

హౌస్లో పునర్నవి లవ్ స్టోరీ నడిపింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె సన్నిహితంగా ఉన్నారు. రాహుల్-పునర్నవి లవ్ స్టోరీ ఆ సీజన్ కి హైలెట్ గా నిలిచింది. ప్రేమికులుగా వారు ప్రచారం పొందారు. అయితే ముద్దులు, హగ్గుల జోలికి పోలేదు. 

హౌస్ నుండి బయటకు వచ్చాక రాహుల్ కోసం ఆమె సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. శ్రీముఖి, రాహుల్ ఫైనల్ లో పోటీపడ్డారు. రాహుల్ విన్నర్ కాగా, శ్రీముఖి రన్నర్ అయ్యింది. రాహుల్, పునర్నవి కొన్నాళ్లు సన్నిహితంగా మెలిగారు. కొన్నాళ్ళకు ఎవరు కెరీర్లో వారు బిజీ అయ్యారు. 

నటనకు దూరమైన పునర్నవి విదేశాల్లో చదువుకుంటుంది. రాహుల్ లవర్ గా ప్రచారం పొందిన పునర్నవి ఓ కుర్రాడిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. ప్రియుడు బర్త్ డే నేపథ్యంలో అతడికి బెస్ట్ విషెస్ తెలియజేసింది. అతనితో ఏకాంతంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. 

Punarnavi Bhupalam

గతంలో పునర్నవి ఆ కుర్రాడితో కనిపించిన దాఖలు లేవు. ఆ కుర్రాడి పేరు కూడా సందేశంలో పొందుపరచలేదు. దాంతో అతడి వివరాలు తెలియరాలేదు. దాంతో పునర్నవితో ఉన్న 28 ఏళ్ల కుర్రాడు ఎవరనే చర్చ మొదలైంది. అతడి వివరాలు పూర్తిగా తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.. 

Latest Videos

click me!