పిల్లల్ని కనను అని కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్న నటి.. కానీ రెండు నెలలకే ప్రెగ్నన్సీ, కన్నీరు మున్నీరవుతూ

Published : May 24, 2024, 09:58 AM IST

నటి కవిత చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు.

PREV
17
పిల్లల్ని కనను అని కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్న నటి.. కానీ రెండు నెలలకే ప్రెగ్నన్సీ, కన్నీరు మున్నీరవుతూ
Actress Kavitha

నటి కవిత చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆమె నటించారు. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు.. ఆమె జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగుతూ వచ్చింది. 

27

కోవిడ్ సమయంలో కవిత ఒక్కసారిగా తన భర్త, కొడుకుని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదాల నుంచి కవిత ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో కవిత తన కుటుంబం గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఫ్యామిలిలో ముందు నుంచి విషాదకర సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని కవిత అన్నారు. 

37

చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. పెళ్లి కూడా త్వరగానే చేశారు. ఆ సమయంలో ప్రేమ గురించి పెద్దగా తెలియదు. కానీ నాకు కాబోయే భర్త సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండాలి.. రిషి కపూర్ లాగా ఉండాలి అని కలలు కనేదాన్ని. నా భర్తని పెళ్ళయాక ప్రేమించా. కవిత భర్త దశరథరాజ్. 

47

పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశాక మా ఆయనకి ఒక కండిషన్ పెట్టా. నేను పిల్లలని కనను అని చెప్పా. జోక్ చేస్తోంది అనుకుని ఆయన పట్టించుకోలేదు. పెళ్లి జరిగింది. మా అత్తగారేమో పిల్లలని త్వరగా కనాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పింది. మా అమ్మకి మాత్రం నేను పిల్లల్ని కనను ని చెప్పా. ఎందుకమ్మా అలా అంటావు.. పిల్లలు ఉండాలి కదా అని చెప్పింది. 

57

అప్పుడు మా ఇంట్లో జరిగిన విషాదం గురించి అమ్మకి గుర్తు చేశా. నువ్వు తమ్ముడిని కన్నావు. చిన్న వయసులోనే మరణించాడు. నువ్వు కనకపోతే అసలు వాడు మరణించేవాడే కాదు కదా.. పుట్టకపోతే చావే లేదు కదా అని ఏడ్చేశాను. పిల్లల్ని పుట్టించడం ఎందుకు చంపడం ఎందుకు అని అడిగా. 

67
Actress Kavitha

అప్పుడు మా అమ్మ, నా భర్త నాకు ధైర్యం చెప్పారు. దానినుంచి బయటకి రా. తమ్ముడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బాధగానే ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత రెండు నెలలకే గర్భవతిని అయ్యా. కానీ రోజూ నా తమ్ముడి ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉన్నా. ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది అని చెప్పి నా భర్త నన్ను వరల్డ్ టూర్ తీసుకెళ్లారు. 

77

నాకు కూతురు పుట్టాక నా మనసు మారింది. సంతోషం పెరిగింది అని కవిత అన్నారు. మొత్తం తనకు 3 పిల్లల్ని కన్నట్లు కవిత తెలిపారు. ఒకేసారి నా భర్త, కొడుకు మరణించడం జీర్ణించుకోలేని విషాదం అని కవిత అన్నారు. ఆమె రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. కానీ ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో రాణించలేదు. 

click me!

Recommended Stories