Shruti Haasan: శృతి హాసన్, అక్షర హాసన్ ఫోటోస్ వైరల్.. ఇదేమి డ్రెస్ బాబోయ్ అంటున్న నెటిజన్లు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 02:13 PM IST

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు.

PREV
18
Shruti Haasan: శృతి హాసన్, అక్షర హాసన్ ఫోటోస్ వైరల్.. ఇదేమి డ్రెస్ బాబోయ్ అంటున్న నెటిజన్లు

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

28

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

38

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

48

ఓ ఫారెన్ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో పడింది శృతి హాసన్. అతడిని తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. వీరిద్దరి పెళ్లి దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడితో విడిపోయింది. ఈ నేపథ్యంలో కాటమరాయుడు చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ కూడా ఇచ్చింది. 

58

తిరిగి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్, క్రాక్ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఇక శృతి హాసన్ మ్యూజిక్ ప్రియురాలు. ఆమెకు సంగీతం, సింగింగ్ లో కూడా గ్రిప్ ఉంది. 

68

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

78

తాజాగా శృతి హాసన్ తన చెల్లి అక్షర హాసన్ తో కలసి ముంబై ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. అక్కా చెల్లెల్లు ఇద్దరూ స్టన్నింగ్ లుక్ అండ్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరూ ధరించిన డిఫెరెంట్ అవుట్ ఫిట్స్ నెటిజన్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 

 

88

 

శృతి హాసన్ కళ్ళు చెదిరేలా ఉన్న బ్లాక్ జాకెట్, స్కట్ లో మెరిసింది. ఇక అక్షర హాసన్ ధరించిన డ్రెస్ చాలా వింతగా ఉంది. స్కై బ్లూ కలర్ టీషర్ట్ ధరించిన అక్షర హాసన్.. ఓ వింతైన జీన్స్ ధరించింది. ఆమె ధరించి ప్యాంట్ చాలా విచిత్రంగా ఉందనే చెప్పాలి. దీనితో అక్కా చెల్లెల ఫ్యాషన్ ట్రెండ్ చూసి నెటిజన్లు ఇదేం డ్రెస్ బాబోయ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

click me!

Recommended Stories