Intinti Gruhalakshmi: అంకితను ఘోరంగా అవమానించిన పరందామయ్య.. తులసి కాళ్ళు పట్టుకున్న అభి!

Published : Apr 22, 2022, 12:47 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 22 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalakshmi: అంకితను ఘోరంగా అవమానించిన పరందామయ్య.. తులసి కాళ్ళు పట్టుకున్న అభి!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సీతమ్మవారు రాములవారి కష్టంలో ఎలా తోడుగా ఉన్నదో నువ్వు కూడా నా కష్టాల్లో అలాగే తోడుగా ఉన్నావు అని ప్రేమ్ (Prem) అంటాడు. ఇక శ్రీరామనవమి రోజు ప్రేమ్ శృతి లు ఆనందంగా గొడవ పడుతూ ఉంటారు. మరోవైపు తులసి (Tulasi) ఫ్యామిలీ ఆనందంగా రాముడి కళ్యాణం లో ఉంటారు.
 

26

అదే క్రమంలో అభి (Abhi) అమ్మ రాముడి ని ఎందుకు అందరూ గొప్పవాడు అంటారు అని అడుగుతాడు. ఇక దానితో కలిసి రాముడి గురించి పలు గొప్ప మాటలు చెప్పి కారణం అడగకుండా.. ఎదురు చెప్పకుండా సతీ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు కాబట్టి అని తులసి (Tulasi) అంటుంది.
 

36

ఆ క్రమంలో అమ్మా తులసి (Tulasi) ఏమైంది?  ఎందుకు అలా ఉన్నావ్ నువ్వు నీలా లేవు ఏంటి అని అనసూయ అడుగుతుంది. దాంతో దేవుడు అలా చేపిస్తున్నాడు అని తులసి మనసులో అనుకుంటుంది. ఈలోగా అక్కడకు గాయత్రి (Gayathri) వచ్చి నా కూతురు ని అల్లుడు ని పంపిస్తాను అని చెప్పి ఈ డిస్కషన్ ఏంటి అని తులసిను అంటుంది.
 

46

దాంతో ఫ్యామిలీ మొత్తం ఒకసారిగా స్టన్ అవుతారు. అదే క్రమంలో తులసి (Tulasi) మీ అత్త గారు చేసిన ఆఫర్ కి ఆశపడి ఈ అమ్మను ఇంటిని వదిలి వెళ్లాలని ఆశపడ్డావుగా అని అడుగుతుంది. ఆ క్రమంలో అభి జరిగిన దాన్ని గ్రహించుకొని భాద పడతాడు. ఇక అంకిత (Ankitha) కూడా నా అమ్మతో వెళ్లడం నాకు ఇష్టమే అని అంటుంది.
 

56

ఆ క్రమంలో పరందామయ్య (Parandamaiah) నీ సంపాదన కూడా ఈ ఇంటికి ఖర్చు చేయాల్సి వస్తుందని పైకి ప్రేమగా నటించి ఇప్పుడు మీ అమ్మతో వెళ్ళిపోతున్నావా అని అంకితను అంటాడు. కానీ అంకిత మనసులో తులసి గురించి ఎంతగా ఆలోచిస్తుందో ఎవరికీ తెలియదు. ఇక తన కూతురిని అలా అంటున్నందుకు గాయత్రి (Gayathri) తులసిపై కోపడుతుంది.
 

66

ఆ తర్వాత అమ్మ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అభి (Abhi) అంటాడు. ఒకవైపు అంకిత (Ankitha) మమ్మల్ని దూరం చేసుకుని కూడా మీరు బాధపడుతున్నారు అని తెలిసిన మరుక్షణం మీ కాళ్ల దగ్గర ఉంటాను అని తులసి చేతులు పట్టుకొని అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories