2000 తండ్రి కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, హీరోగా నటించిన `హే రామ్` చిత్రంతో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది శృతిహాసన్.
2009లో `లక్` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి సినిమా హిందీలో నటించడం విశేషం. ఆ తర్వాత రెండేళ్ళకు తెలుగులో `అనగనగా ఓ ధీరుడు` చిత్రంతోఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకిగానూ డెబ్యూ హీరోయిన్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
శృతి ఉండేది చెన్నైలోనే అయినా తమిళంలోకి ఎంట్రీ తెలుగు సినిమా తర్వాతే కావడం విశేషం. `సెవన్త్ సెన్స్ ` చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.
`ఓ మై ఫ్రెండ్`, `త్రీ` చిత్రాలతో మెరిసిన ఈ హాట్ భామ్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా `గబ్బర్ సింగ్`లో నటించి కెరీర్‌లో భారీ బ్రేక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఇక వెనక్కితిరిగి చూసుకునే అవసరం రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది.
వరుసగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కమల్ తనయ అనే పిలుపుకు ఎప్పుడోఫుల్‌స్టాప్ పెట్టింది.
చివరగా 2017లో తెలుగులో `కాటమరాయుడు`, హిందీలో `బెహన్ హోగి తెరి`, తమిళంలో `ఎస్3` చిత్రాల్లో మెరిసింది. ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలోవిజయాలను అందుకోలేకపోయాయి. దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న శృతి ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన `క్రాక్`, పవన్‌కి మూడోసారి జోడిగా `వకీల్ సాబ్`లో, తమిళంలో `లాబమ్` చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే శృతి సింగర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఆమె స్వయంగా రూపొందించిన స్పెషల్ వీడియో సాంగ్ `ఎడ్జ్' ఇటీవల విడుదలై హాల్ చల్ చేస్తుంది. మరోవైపుతాజాగా శృతి ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.