Shriya Saran - Mirai Promotions: మిరాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న శ్రియా శరణ్ తన లవ్ స్టోరీని తొలిసారి బయటపెట్టింది. ఈ రివీల్ షోకు హైలైట్‌గా మారగా, అభిమానులు సోషల్ మీడియాలో వైరల్‌గా షేర్ చేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరోయిన్ శ్రియా శరణ్, దాదాపు రెండు దశాబ్దాలుగా తన నటనతో, గ్లామర్‌తో, డాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది.2001లో విడుదలైన ‘ఇష్టం’తో సినీ రంగంలో అడుగుపెట్టిన శ్రియా, తరువాత సంతోషం, శివాజీ: ది బాస్, నేనున్నాను వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించింది. రజనీకాంత్‌తో చేసిన శివాజీ ఆమె కెరీర్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు అన్ని రకాల పాత్రలు పోషించి, పాన్-ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించింది. తాజాగా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
26
మిరాయ్
‘హను-మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన తేజ సజ్జా. ఇప్పుడు‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఈగల్’తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. హై-బడ్జెట్ ప్రాజెక్ట్ తెరకిక్కన ఈ ఫాంటసీ యాక్షన్ మూవీలో తేజా సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా సరన్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ ఈ మూవీకి హైలెట్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడానికి మిరాయ్ సిద్దమైంది. ఈ సినిమాలో శ్రియా తన పాత్రలో నటించి, మెప్పించింది. తన నటన మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి.
36
కపిల్ శర్మ షోలో మిరాయ్ టీం
ఇదిలా ఉంటే.. మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’ పాల్గొంది. ఈ షోలో సీనియర్ హీరోయిన్ శ్రియాతో పాటు జగపతి బాబు, తేజా సజ్జా, రితికా నాయక్ పాల్గొన్నారు. ఈ షోలో వీరు మిరాయ్ మూవీ విశేషాలను పంచుకున్నారు. వారి సరదా సంభాషణలు, చమత్కారాలు, డ్యాన్స్ స్టెప్స్ తో షోకు మరింత జోష్ తీసుకవచ్చారు. ఈ తరుణంలో యంగ్ హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. జగపతి బాబు చాలా రొమాంటిక్ కామెంట్స్ చేయడంతో అక్కడున్నవారు నవ్వుల్లో మునిగిపోయారు. జగపతి బాబు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు.
ఇక ఈ షోలో శ్రియా సరన్ లవ్ స్టోరీ హైలెట్ గా నిలిచింది. తొలిసారిగా కపిల్ శర్మ షో శ్రియ తన ప్రేమకథను చెప్పింది. ఒకసారి మాల్దీవుడ్ కు తన ఫ్రెండ్స్ కలిసి వెళ్లాలని ప్లాన్ చేసిందట. అయితే.. ముందుగా అనుకున్న డేట్ కాకుండా పొరపాటున విమాన టికెట్‌ను మరో నెలలో బుక్ చేసేందట. దీంతో ఫ్రెండ్స్ తో కాకుండా ఆమె ఒంటరిగా మాల్దీవుల క్రూజ్ కు వెళ్లిందట. ఈ టూర్ లో ఆమెకు రష్యా జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అండ్రే కోశ్చీవ్ తో పరిచయం ఏర్పడిందట. మొదటి పరిచయం నుంచే ఇద్దరి మధ్య అడ్వెంచరస్ జర్నీ మొదలైందని తన ప్రేమ కథను రివీల్ చేసింది.
56
ఆ సినిమా నుంచి భయపడ్డారు
శ్రియా చెప్పిన ఆసక్తికర విషయమేమిటంటే- అండ్రే మొదటగా చూసిన ఆమె సినిమా దృశ్యం. ఆ సినిమాలో తన పాత్రను చూసి అండ్రే చాలా భయపడ్డారట. అయినప్పటికీ, తమ మధ్య బంధం బలపడిందని తెలిపారు. 2018 మార్చిలో వీరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2021లో వీరికి పాప రాధ పుట్టింది. ప్రస్తుతం అండ్రే టెన్నిస్ మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు.
66
శ్రియా కెరీర్ అప్‌డేట్
సౌత్ ఫిల్మీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది నటి శ్రియా సరన్. దృశ్యం, దృశ్యం 2 వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. ఇటీవల సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రెట్రో’లో నటించింది.
ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ‘మిరాయ్’సినిమాతో శ్రియా ప్రేక్షకుల సినిమాతో ముందుకు వచ్చారు. కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీలో తేజా సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి, కపిల్ శర్మ షోలో శ్రియా సరన్ లవ్ స్టోరీ హైలెట్ గా నిలిచింది.