నాగార్జున, వెంకటేష్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన బ్లాక్‌ బస్టర్‌ మల్టీస్టారర్‌‌ ఏంటో తెలుసా? ఆయన వల్లే

Published : Sep 12, 2025, 04:24 PM IST

మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ కలిసి ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా నటించలేదు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ బ్లాక్‌ బస్టర్‌ మూవీ మిస్‌ అయ్యింది.   

PREV
15
వెంకటేష్‌, నాగార్జున కాంబినేషన్‌లో మిస్‌ అయిన మల్టీస్టారర్‌

మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ వరుసకి బావబామ్మర్దులు. వెంకీ సిస్టర్‌ లక్ష్మిని నాగ్‌ మొదట పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. చైతూ వీరికే జన్మించారు. ఆ తర్వాత విడిపోయారు. అయితే వెంకీ, నాగార్జు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కాకపోతే `త్రిమూర్తులు` చిత్రంలో నాగ్‌ చిన్న గెస్ట్ రోల్‌ చేశారు. అది తప్ప వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీస్‌ రాలేదు. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఓ మూవీకి ప్లాన్‌ జరిగింది. నిర్మాత అన్ని ప్లాన్‌ చేశాడు. కానీ డైరెక్టర్‌ హ్యాండివ్వడంతో ఆశలన్నీ తలక్రిందులయ్యాయి.  ఆ కథేంటో చూస్తే

25
మణిరత్నం దర్శకత్వంలో సూపర్‌ హిట్‌ అయిన `అగ్నినక్షత్రం`

తమిళంలో 1988లో `అగ్నినక్షత్రం` అనే మూవీ రూపొందింది. దీనికి మణిరత్నం దర్శకుడు. ప్రభు, కార్తీక్‌, అమల, నిరోషి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఇద్దరు సవతి సోదరుల చుట్టూ తిరిగే కథ. వీరికి తండ్రి ఒక్కడే.  ఫ్యామిలీలో కొన్ని హక్కులకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు విభేదిస్తారు. గొడవలు పడతారు. అది ఆద్యంతం నాటకీయంగా సాగుతుంది. ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎలిమెంట్లు, మంచి మాస్‌ మసాలా అంశాలు జోడించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళంలో పెద్ద హిట్‌ అయ్యింది.

35
మణిరత్నం నో చెప్పడంతో వెంకీ, నాగ్‌ మల్టీస్టారర్‌ మిస్‌

దీంతో ఈ మూవీని తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు నిర్మాత సీఎల్‌ సరసారెడ్డి. తెలుగులో నాగార్జున, వెంకటేష్‌ హీరోలుగా సినిమా చేస్తే బాగుంటుందని భావించారు. ఈ హీరోలను కూడా ఈ రీమేక్‌కి ఒప్పించాడు. తానే నిర్మాతగా ఈ మూవీ నిర్మించాలనుకున్నారు సరసారెడ్డి. అయితే చివరి నిమిషంలో దర్శకుడు మణిరత్నం హ్యాండిచ్చాడు. తెలుగులో రీమేక్‌ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక ఆ మూవీని తెలుగులో `ఘర్షణ` పేరుతో డబ్‌ చేశారు.తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ అయిన ఈ మూవీ ఇక్కడ మామూలుగానే ఆడింది.

45
`ఘర్షణ` మూవీ చేసిన వెంకటేష్‌

అలా మణిరత్నం కారణంగా నాగార్జున, వెంకటేష్ కాంబినేషన్‌లో రావాల్సిన మల్టీస్టారర్‌ మూవీ మిస్‌ అయ్యింది. ఆ తర్వాత ఎప్పుడూ అది సెట్‌ కాలేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత `ప్రేమమ్‌` సినిమాలో నాగ్‌, వెంకీ గెస్ట్ రోల్‌ చేశారు. నాగచైతన్య హీరోగా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కాకపోతే ఇందులో నాగ్‌, వెంకీలకు కాంబినేషన్‌ సీన్లు లేవు. వేర్వేరు సందర్భాల్లో జస్ట్ అలా మెరుస్తారు. ఇదిలా ఉంటే `ఘర్షణ` పేరుతో తెలుగులో సినిమా చేశారు వెంకీ. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌ దర్శకుడు. అసిన్‌ హీరోయిన్‌గా నటించింది. 2004లో విడుదలైన ఈ మూవీ యావరేజ్‌గానే ఆడింది.

55
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకీ సినిమా

ఇక వెంకటేష్‌ ఇప్పుడు.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న `మన శంకర్‌వరప్రసాద్‌ గారు` మూవీలో వెంకీ గెస్ట్ రోల్‌ చేయబోతున్నారట. చిన్న క్యామియోలో ఆయన మెరుస్తారని ఇప్పటికే అనిల్‌ రావిపూడి, వెంకీ స్పష్టం చేశారు. మరోవైపు నాగార్జున ఇటీవల `కుబేర`, `కూలీ` చిత్రాల్లో నటించారు. `కూలీ`లో నెగటివ్‌ రోల్‌ చేసి మెప్పించాడు. సోలో హీరోగా ఇంకా మరే మూవీని ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన `బిగ్‌ బాస్‌ తెలుగు 9`కి హోస్ట్ గా చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories