నటి సాయి పల్లవి ఆరు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి చిత్రాలకు ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఇవి కాకుండా, సాయి పల్లవి మూడు సార్లు సైమా అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రేమమ్, లవ్ స్టోరీ, అమరన్ చిత్రాలకు ఆమె సైమా అవార్డును గెలుచుకుంది. ఇవి కాకుండా, రెండు ఆనంద వికటన్ సినిమా అవార్డులు, రెండు ఆసియా నెట్ అవార్డులు, చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండు అవార్డులు ఇలా సాయి పల్లవి గెలుచుకున్న అవార్డుల జాబితా పెరుగుతూనే ఉంది.