ప్రముఖ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి ఇప్పటికీ తన గ్లామర్‌తో అభిమానుల మనసులు దోచుకుంటోంది.1982లో జన్మించిన శ్రియా శరణ్, తన సినీ ప్రయాణాన్ని 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో ప్రారంభించింది. తరువాత సంతోషం, నేనున్నాను, శివాజీ: ది బాస్ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హిరోయిన్‌గా ఎదిగింది శ్రీయా. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాల్లో శ్రియా నటించి మెప్పించింది.