Ram Charan Peddi:రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓటీటీ, ఆడియో, థియేట్రికల్ రైట్స్ ద్వారా రికార్డు బిజినెస్ చేస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’(Peddi). స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ ఆడిన క్రికెట్ షాట్ ట్రెండ్ గా మారింది. ఇలా కొత్త అప్డేట్ ఈ మూవీపై మరింత హైప్ అండ్ క్రేజ్ పెంచుతున్నాయి.
26
₹300 కోట్లకు పైగా బడ్జెట్!
‘పెద్ది’ సినిమా బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ మాత్రమే సుమారు 100 కోట్లుగా వినిపిస్తోంది.
ఇక మేకింగ్ కాస్ట్ 200 కోట్లను దాటిందని తెలిసింది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిందనీ, ఇంకా సగం షూటింగ్ షెడ్యూల్ మిగిలి ఉందట ఫీల్మి వర్గాల టాక్.
భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవల్ లో రికార్డులు క్రియేట్ చేయాలని పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నరట పెద్ది మూవీ మేకర్స్.
36
పెద్ది కథ ఇదేనా ?
గ్రామీణ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో నడిచే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అయిన పెద్దిలో రామ్ చరణ్, జాన్వి కపూర్ లు లీడ్ లో నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల రామ్ చరణ్ స్వయంగా పెద్ది గురించి ఒక అప్‌డేట్‌ను పంచుకున్నాడు, AR రెహమాన్‌ను కలిసిన ఫోటోను పోస్ట్ చేశాడు. మొదటి సింగిల్ త్వరలో వస్తుందని టీజ్ చేశాడు. మరో అప్‌డేట్‌లో సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దాదాపు 50% షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు.
రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ జరగనట్టు టాక్. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో 100 కోట్లకు పైగా బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నయట. రామ్ చరణ్ క్రేజ్ అలాంటిది మరి. మొత్తానికి థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.220–250 కోట్ల మధ్య బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి.
56
రికార్డు స్థాయిలో డిజిటల్ రైట్స్
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ ప్రకటించగానే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ లుక్ కే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకి భారీ ఓటీటీ డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం.. పెద్ది నిర్మాతలు తమ సినిమా డిజిటల్ హక్కులను రూ.130 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు అమ్మినట్లు తెలుస్తోంది. అలాగే, పెద్ది ఆడియో రైట్స్ ను ‘టీ సిరీస్’రూ.20 కోట్లకు సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు టాక్.
66
రిలీజ్ డేట్ కన్ఫర్మ్
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందట. మిగిలిన షెడ్యూల్స్ పూర్తి చేయడానికి యూనిట్ స్పీడ్ పెంచింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి, ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల మార్క్‌ని టార్గెట్ చేస్తూ, విడుదలకు ముందే ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసింది.