షర్ట్ బటన్స్ తీసేసి శ్రియా శరన్ అందాల విందు.. పొట్టి నిక్కరులో గ్లామర్ షో మామూలుగా లేదుగా..

Published : May 02, 2022, 04:34 PM IST

హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran) సినిమాల జోరు పెంచుతోంది. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’లో కనిపించిన శ్రియా.. ప్రస్తుతం పలు భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తోంది.  

PREV
17
షర్ట్ బటన్స్ తీసేసి శ్రియా శరన్ అందాల విందు.. పొట్టి నిక్కరులో గ్లామర్ షో మామూలుగా లేదుగా..

టాలీవుడ్ సీనియర్ హీరరోయిన్లలో శ్రియా శరన్ ఒకరు. తెలుగు  ప్రేక్షకులకు ఎంతో దగ్గరై.. ఫ్యామిలీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. అంతే కాకుండా  యువతనూ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. మరోవైపు నటనతోనూ ప్రేక్షకులను మెప్పించిందీ సుందరి.
 

27

శ్రియా శరన్ సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికీ సరిగ్గా 21 ఏండ్లు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమాతోనే తన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తొలుత ‘ఇష్టం’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ వెంటనే వచ్చిన ‘సంతోషం’ సినిమాలో నాగార్జున సరసన నటించి పాపులర్ అయ్యింది.

37

అప్పటి నుంచి శ్రియా శరన్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. తను నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాలను సాధించాయి.  తను నటించిన ‘సంతోషం’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘ఠాగూర్’, ‘నేనున్నాను’, ‘ఛత్రపతి’ వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా నిలిచాయి. 

47

అయితే తనకు పలు భాషల చిత్రాల్లోనూ అవకాశాలు రావడంతో అక్కడ తన మార్క్ చూపించింది. ఇలా తెలుగుతో పాటు, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రాల్లో నటించింది. 

57

కొన్నేండ్లుగా శ్రియా ఏడాదికో సినిమా అన్నట్టుగానే నటిస్తూ వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు ఒకే చెప్పాకా.. వరుస చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసిందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు కన్నా హిందీ, తమిళ భాషల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

67

ప్రస్తుతం తను హిందీ చిత్రం దృశ్యం 2 (Drishyam 2) లో నటిస్తోంది. ప్యార్లర్ గా ‘కబ్జా’ అనే  కన్నడ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తను సైన్  చేసిన ఓ హిందీ చిత్రం ‘తడ్కా’ కాస్తా డిలే అవుతోంది. మరోవైపు రెండు తమిళ చిత్రాలు ‘నరగసూరన్, సందక్కరి’ కూడా డిలే అయ్యాయి. త్వరలో వీటి అప్డేట్ కూడా రానుంది.
 

77

సినిమాల్లో నే కాకుండా శ్రియా సోషల్ మీడియాలోనూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా పొట్టి నిక్కరులో థైస్ చూపిస్తూ.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి అందాల విందు చేసింది. తన అందాల ధాటికి నెటిజన్లు తట్టుకోలేకుపోతున్నారు. పిక్స్ కు ‘క్షణాల్లోనే నా ఆలోచనలు   తప్పిపోయి, నన్ను నేను వెతుకుంటున్నాను.. మీరు నన్ను జయించగల ఏకైక మార్గం ప్రేమ’ అంటూ క్యాప్షన్  ఇచ్చింది. ఈ ఫొటోలు  ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories