కొరటాలలో ధైర్యాన్ని నింపుతున్న ఎన్టీఆర్‌.. ఫ్యాన్స్ కోసం మరో ప్లాన్‌.. ఫస్ట్ టైమ్‌ అలా..

Published : May 02, 2022, 03:35 PM ISTUpdated : May 02, 2022, 05:06 PM IST

సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అండగా నిలుస్తున్నారు. `ఆచార్య` ఫలితంతో డిజప్పాయింట్‌ అవుతున్న సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌లో ధైర్యాన్ని నింపుతున్నారు. అన్ని రకాలుగా కొరటాలని రెడీ చేస్తున్నారు తారక్‌. 

PREV
16
కొరటాలలో ధైర్యాన్ని నింపుతున్న ఎన్టీఆర్‌.. ఫ్యాన్స్ కోసం మరో ప్లాన్‌.. ఫస్ట్ టైమ్‌ అలా..

కొరటాల శివ(Koratala Siva) అంటేనే సక్సెస్‌. ఆయన చిత్రాలు మినిమమ్‌ గ్యారంటీ అనే పేరుంది. మంచి సందేశానికి కమర్షియల్‌ అంశాలను జోడించి వెండితెరపై మ్యాజిక్‌ చేయడం ఆయన ప్రత్యేకత. అలా `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్‌`, `భరత్‌ అనే నేను` చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ఇటీవల ఆయన `ఆచార్య`ని తెరకెక్కించారు. మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రం పరాజయం చెందింది. `ఆచార్య`(Acharya) ఫెయిల్యూర్‌తో కొరటాల కాస్త డిజప్పాయింట్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. చిరంజీవి, చరణ్‌లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

26

ఈ ప్రభావం ఇప్పుడు కొరటాల రూపొందించబోతున్న `ఎన్టీఆర్‌ 30`(NTR 30) చిత్రంపై పడబోతుందనే టాక్‌ మొదలైంది. రాజమౌళి సెంటిమెంట్‌కి మరోసారి కొరటాల బలి కాబోతు్నారే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో కొరటాల- ఎన్టీఆర్‌ చిత్రం ఎలా ఉండబోతుందనే టెన్షన్‌ అటు తారక్‌, మరోవైపు ఆయన అభిమానుల్లోనూ నెలకొంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కాస్త ఆలోచనలో పడ్డారని టాక్‌ మొదలైనా, ఫైనల్‌గా వారు గతం గతః అంటూ నెక్ట్స్ సినిమాపై ఫోకస్‌ పెట్టాలంటున్నారు. అంతేకాదు `ఎన్టీఆర్‌ 30` దుమ్ము రేపడం ఖాయమంటున్నారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్‌ సైతం దర్శకుడు కొరటాలకి ధైర్యాన్ని నూరిపోస్తున్నారట.  తారక్‌ స్వయంగా కొరటాలకి భరోసాగా నిలిచే విషయాలు వెల్లడించారట.

36

 గత ఫలితాలను ఆలోచించవద్దని, ప్రస్తుతం తాము చేయబోతున్న కథపై మరింత ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. అంతేకాదు అవసరమైతే ఇంకాస్త టైమ్‌ తీసుకో అని కూడా సలహాలిచ్చారట ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతోపాటు ఫ్యాన్స్ కోసం మరో ప్లాన్‌ చేశారట ఎన్టీఆర్‌. దర్శకుడు కొరటాల శివని మళ్లీ ట్విట్టర్ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని తెలిపారట. `ఆచార్య` ప్రారంభం సమయంలో కొరటాల ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చారు. ఆయన కొన్ని ట్రోల్స్ కి గురైన నేపథ్యంలో దాన్ని వదిలేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ట్విట్టర్‌ ఓపెన్‌ చేయాలని, అందులో తమ సినిమాకి సంబంధించిన అప్‌డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్‌ తెలిపినట్టు సమాచారం. 
 

46

ఎన్టీఆర్‌ సినిమా అంటే అభిమానులు అప్‌డేట్ల కోసం ఆరా తీస్తుంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు కోరుకుంటారు. అందుకే ఫ్యాన్స్ కోసం ఈ ప్లాన్‌ చేయబోతున్నట్టు తెలుస్తుంది. తమ సినిమా అప్‌డేట్లు ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ఉంటుందని, వారికి నిత్యం టచ్‌లో ఉండేందుకు యూజ్‌ అవుతుందని చెప్పారట తారక్‌. సరైన టైమ్‌లో అప్‌డేట్లు ఇవ్వకపోతే ఫ్యాన్స్‌ డిజప్పాయింట్‌ అవుతారని, అందుకే సోషల్‌ మీడియాలోకి మళ్లీ రావాలని కోరారట. దీంతో కొరటాల బ్యాక్‌ టూ ట్విట్టర్‌ కి లైన్‌ క్లీయర్‌ అయినట్టే అని టాక్‌. 

56

ఇదిలాఉంటే ఎన్టీఆర్‌ 30 చిత్రాన్ని హై ఓల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారు దర్శకుడు కొరటాల. ఈ విషయాన్ని ఇటీవల `ఆచార్య` ప్రమోషన్స్ లో తెలిపిన విషయం తెలిసిందే. గత సినిమాల్లో లేని యాక్షన్‌ ఇందులో ఉంటుందని, కథ, ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, చాలా స్పాన్‌ ఉన్న స్టోరీ అని, అందుకే పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు దర్శకుడు కొరటాల. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ బరువు తగ్గనున్నారట. ఎప్పుడూ లేని విధంగా చాలా సన్నగా కనిపించబోతున్నట్టు టాక్‌. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా మే 20న ఈ చిత్రం లాంఛ్‌ కాబోతుందని టాక్‌. జూన్ సెకండ్ వీక్ లో ఇంట్రడక్షన్ షాట్ తోనే షూటింగ్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట.

66

ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఇందులో అలియాభట్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలొచ్చాయి. ఈ సినిమా చేస్తున్నట్టు అలియాభట్‌ కూడా ప్రకటించారు. కానీ ఆమె మ్యారేజ్‌ అయిన నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు టాక్‌. ఆమె స్థానంలో రష్మిక మందన్నా పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories